Jagga Reddy: ఆ తప్పు వల్లే కాంగ్రెస్‌కు ఘోర ఓటమి, ఈ మీటింగ్‌లో మొత్తం చెప్పేస్తా.. జగ్గా రెడ్డి అసంతృప్తి

బుధవారం హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘోర పరాభవం గురించి గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి కీలకమైన నేతలంతా హాజరయ్యారు.

FOLLOW US: 

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి స్పందించారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చవి చూడడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి కేవలం 3 వేల ఓట్లు మాత్రమే రావడం పెద్ద షాక్ అని అన్నారు. కనీసం డిపాజిట్లు కూడా దక్కకపోవడం దారుణమని అభిప్రాయ పడ్డారు. హుజూరాబాద్‌లో నాన్ లోకల్ వ్యక్తిని అభ్యర్థిగా పెట్టడం చాలా పెద్ద తప్పిదమని అన్నారు. ఆయన్ను బలి పశువును చేశారని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై జగ్గా రెడ్డి బుధవారం ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడారు. 

3 వేల ఓట్లతో తమ పార్టీ అభ్యర్థి ఓడిపోవడం ఘన చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ లేదని జగ్గా రెడ్డి గుర్తు చేశారు. నామినేషన్‌కు రెండు రోజులు గడువు ఉండగా అభ్యర్థిని ప్రకటించడం కరెక్టు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే 4 నెలల క్రితం ఈ నిర్ణయం తీసుకొని పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. దీనికి బాధ్యులైన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

హుజూరాబాద్ ఉప ఎన్నిక మొత్తం డబ్బుల చుట్టూనే తిరిగిందని, కాంగ్రెస్ పార్టీ డబ్బులు పెట్టకపోవడం కూడా ఒక కారణమని జగ్గా రెడ్డి వ్యాఖ్యానించారు. అయినా, చివరికి తాము తిరిగి పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి తిరిగి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మీటింగులో మొత్తం చెప్పేస్తా
‘‘ఎన్నికల్లో పెద్ద పెద్ద స్టార్లు వెళ్తేనే ఓట్లు పడడం లేదు. నేను వెళ్తే ఓట్లేం పడతాయి. జగ్గా రెడ్డిని చూస్తే ఓట్ల వస్తయా? మాణిక్కం ఠాకూర్‌కు ఎన్నికల గురించి ఏం తెలియదు. ఈ మీటింగ్‌లో ఏదో ఒకటి తేల్చుకుంటా. నేను చెప్పదల్చుకున్నదంతా మీటింగ్‌లో చెబుతా. మొత్తానికి నా సీటు సంగారెడ్డిపై దృష్టి పెడతా. పార్టీ అంతర్గత వ్యవహారాలు లాంటి వాటిని నేను పట్టించుకోదల్చుకోలేదు.’’ అని జగ్గా రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

Also Read: Hyderabad: పెట్రోల్ ధరలతో భయమొద్దు.. రూ.100 చెల్లించండి రోజంతా తిరగండి.. సజ్జనార్ ప్రకటన

మధ్యలోనే వెళ్లిపోయిన జానా రెడ్డి
మరోవైపు, బుధవారం హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘోర పరాభవం గురించి గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి కీలకమైన నేతలంతా హాజరయ్యారు. ఈ భేటీకి రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, జానా రెడ్డి, షబ్బీర్‌ అలీ, పొన్నాల, బోస్‌రాజు, శ్రీధర్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హాజరు కాలేదు. జగ్గా రెడ్డి ఆలస్యంగా హాజరయ్యారు. సమావేశానికి వచ్చిన జానా రెడ్డి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. నల్గొండలో స్నేహితుడి అంత్యక్రియలకు వెళుతున్నట్లు ఆయన అక్కడి విలేకరులకు చెప్పారు. ఎందుకు వెళ్లిపోతున్నారని విలేకరులు ప్రశ్నించగా.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పేసి వెళ్లిపోయారు.

Also Read: హుజూరాబాద్ ఓటమిపై స్పందించిన మంత్రి కేటీఆర్... 20 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని ట్వీట్

Also Read: Weather Updates: వచ్చే మూడు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి

Also Read: Eatala Rajender: కేసీఆర్ అహంకారాన్ని బొంద పెట్టిన.. మీ రుణం తీర్చుకోలేను.. ఉపఎన్నిక ఫలితంపై ఈటల

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 03 Nov 2021 01:30 PM (IST) Tags: telangana congress news gandhi bhavan Mla jagga reddy Huzurabad By Election Results Sangareddy MLA

సంబంధిత కథనాలు

TS SSC Exams : రేపటి నుంచి తెలంగాణ పదో తరగతి పరీక్షలు, ఐదు నిమిషాల నిబంధన వర్తింపు

TS SSC Exams : రేపటి నుంచి తెలంగాణ పదో తరగతి పరీక్షలు, ఐదు నిమిషాల నిబంధన వర్తింపు

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

Minister Harish Rao : పెట్రోల్, డీజిల్ సుంకాల తగ్గింపుపై స్పందించిన మంత్రి హరీశ్ రావు, ఏమన్నారంటే?

Minister Harish Rao : పెట్రోల్, డీజిల్ సుంకాల తగ్గింపుపై స్పందించిన మంత్రి హరీశ్ రావు, ఏమన్నారంటే?

Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత

Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత

Secunderabad: లిఫ్టులో చీర కొంగు అడ్డు పెట్టి మహిళ పాడు పని, సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు - అవాక్కైన పోలీసులు

Secunderabad: లిఫ్టులో చీర కొంగు అడ్డు పెట్టి మహిళ పాడు పని, సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు - అవాక్కైన పోలీసులు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!

Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!

IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?

IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?