Medchal Crime News:మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో విషాదం- ఇంట్లోని సంపులో ఇద్దరు పిల్లలతో దూకి తల్లి- చిన్నారులు మృతి
Medchal Crime News:మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో కుటుంబ కలహాలు ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసింది. తల్లి చేసిన తొందరపాటు చర్య ఆ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది.

Medchal Crime News: మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు చిన్నారులతో తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ కలహాలతో ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. గాయాలపాలైన తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
కామారెడ్డిలోని పిట్ల మండలం ధర్మారం విలేజ్‌కు చెందిన లక్ష్మి బాచుపల్లిలో ఉంటోంది. భర్త లక్ష్మణ్ ఇటుక బట్టీలో పని చేస్తున్నాడు. రోజు వారీ కూలీగా వర్క్ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవని చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని అంటున్నారు.
మూడేళ్ల అరుణ్, 8ఏళ్ల సుభాష్‌తో కలిసి లక్ష్మి ఇంట్లో ఉన్న సంపులో దూకింది. అయితే నీళ్లు తక్కువగా ఉండటంతో తల్లి గాయాలతో బయటపడింది. చిన్నారులు మాత్రం సంపులో ముగనిగి ఊపిరి ఆడకచనిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన తల్లిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





















