అన్వేషించండి

Fish Prasadam: జూన్ 8 చేప ప్రసాదం పంపిణీ- నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు-ఈసారి లక్షన్నర చేపలు సిద్ధం

Fish Prasadam: బత్తిని సోదరులు హైదరాబాద్ ప్రతీ ఏటా నిర్వహించే చేప ప్రసాదం పంపిణీకి ఈసారి భారీ స్దాయిలో ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.

Fish Prasadam: ప్రతీ ఏటా తెలుగు రాష్ట్రాల ప్రజలకు బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదం ఓ పండుగలా జరుగుతుంది.భారీగా జనం ఈ చేప ప్రసాదం కోసం పోటీ పడుతుంటారు. ఈ ఏడాది జూన్ 8వ తేదీన ఈ చేప ప్రసాదం పంపిణీ జరగనున్న  వేళ అధికారులు  ముందస్తు వ్యూహాలతో, తొక్కిసలాటకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లకు సిద్దమైయ్యారు.

185 సంవత్సరాలుగా ఉబ్బస వ్యాధిగ్రస్తులకు హైదరాబాద్ లో బత్తిని సోదరులు చేపప్రసాదం పంపిణీ చేస్తున్నారు. లక్షల మంది పాల్గొనే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో పోలీసులు పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకోవాలని లా అండ్ ఆర్డర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ కోసం 1.5 లక్షల చేప పిల్లలను ఏర్పాటు చేసినట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. చేప పిల్లల ఖర్చును నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ భరించాలని సూచించారు. వచ్చే భక్తులకు క్యూ లైన్ లో ఇబ్బందులు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు, మహిళలకు వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయనున్నారు. వీఐపీ పాస్ లు లిమిట్ గా ఇవ్వడం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని భావించి, ఆ దిశగా చర్యలు తీసుకోనున్నారు. చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో వారికి సరిపడ తాగునీటి సౌకర్యాలు , టాయిలెట్స్ ఏర్పాటు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే భోజన సౌకర్యాలకు  ఇలా ఎటువంటి ఇబ్బందులు సర్వం సిద్దం చేయనున్నారు.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పక్కా ప్లాన్ రూపొందించనున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ చుట్టూ పది పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. వాహనాలు మొరాయించినప్పుడు వాటిని తీసుకెళ్లడానికి క్రేన్ వాహనాలు సిద్ధం చేశారు. వీటితోపాటు ఎక్కడికక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. చేప ప్రసాదం పంపిణీ పూర్తయ్యే వరకూ జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది  అందుబాటులో ఉండటంతోపాటు మొబైల్ టాయిలెట్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఎప్పటికప్పుడు చెత్తను తరలించేందుకు తగిన వాహనాలు సిద్ధం చేశారు. వెటర్నరీ డాక్టర్ లు ఫిష్ పర్యవేక్షణ చేయడంతోపాటు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార పర్యవేక్షణ చేసేలా చర్యలు చేపట్టారు. 

దూద్ బౌలి, నాంపల్లి లో కరెంట్ ఇబ్బందులు లేకుండా చూడటంతోపాటు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి రావడం కోసం ఆర్టీసీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ ,చర్లపల్లి నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తేనున్నారు. చేప ప్రసాదం పంపిణీ జరిగే ప్రదేశాల్లో వీల్ చైర్లు ఏర్పాటు చేయడం ,నాలుగు హెల్త్ క్యాంపులు ,నాలుగు అంబులెన్స్ లు సిద్దంగా ఉండనున్నాయి. చేప ప్రసాదం వేసే వాలంటీర్లకు సీపీఆర్ శిక్షణ ఇవ్వనున్నారు. ప్రసాదం కోసం టోకెన్ లకు అదనపు కౌంటర్ లు ఏర్పాటు చేయడం, ఐ అండ్ పీఆర్ ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇవ్వడం చేప ప్రసాదం కోసం వచ్చే వారికి తగిన సమాచారం అందించడం, లయన్స్ క్లబ్ ,NCC నుంచి వాలంటీర్ లను అందుబాటులో ఉంచడం,. అన్ని డిపార్ట్మెంట్ లను కోఆర్డినేట్ చేసుకోవడానికి 20 ప్రాంతాల్లో ఒక ఆర్డీవో,ఒక అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేయడం ద్వాారా ఈ సారి చేప ప్రసాదం పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సర్వం సిద్దంకాబోతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Embed widget