KTR on Modi: మోడీ, ఈ ఐదు స్కామ్‌లపై విచారణ జరిపిస్తారా- లైడిటెక్టర్ టెస్ట్‌కు వస్తారా? కేటీఆర్ సవాల్
KTR on Modi: మోడీ, అదానీ మధ్య ఉన్న సంబంధాలపై దర్యాప్తు సంస్థల విచారణతోపాటు లైడిటెక్టర్ పరీక్షకు సిద్దమా అని కేటీఆర్ సవాల్ చేశారు.
KTR on Modi: గౌతమ్ అదానీ ప్రధానమంత్రి మోడీ బీనామీ అని దేశ ప్రజలందరికీ తెలుసని ఇది ముమ్మాటికి నిజమని ఆరోపణలు చేశారు మంత్రి కేటీఆర్. గౌతమ్ అదానీ అనే వ్యక్తిపై ఓ అంతర్జాతీయ సంస్థ రిపోర్ట్ ఇచ్చినా కేంద్రం స్పందించకపోవడం దేనికి సంకేతమని నిలదీశారు. దీనిపై ఆర్థికమంత్రి స్పందించరూ... మోడీ బయటకు వచ్చి మాట్లాడరని అన్నారు. 13 లక్షల కోట్లు ఆవిరైనా... ఎస్బీఐ, ఎల్‌ఐసీ డబ్బులు పోయినా దేశ ప్రధాని ఉలకరు పలకరన్నారు. బినామీ అయిన అదానీని కాపాడుకోవడం మోడీతోపాటు మిగతా వాళ్ల పని అన్నారు.
ఒక సంస్థకు ఆరు ఎయిర్‌పోర్టులు ఇవ్వడం తప్పని నీతి ఆయోగ్, ఫైనాన్స్ మినిస్ట్రీ రిపోర్టులు ఇచ్చినా పాలసీనే మార్చేసిన ఘతన మోడీకే దక్కుతుందన్నారు కేటీఆర్. ముంద్రా పోర్టులో 21వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ దొరికినా ఎలాంటి కేసు అదానీపై లేదన్నారు. దర్యాప్తు సంస్థల కూడా దీనిపై విచారించే దమ్ములేదన్నారు.
మోడీ ఒత్తిడి తీసుకొచ్చి అదానికి ప్రాజెక్టు ఇప్పించారని శ్రీలంక ప్రభుత్వం చెప్పిందని దానిపై కూడా మోడీ ఎందుకు స్పందించలేదన్నారు కేటీఆర్. ఇది జీ టూ జీ అని అక్కడ ప్రభుత్వం చెప్పిందని... జీ అంటే గొటాబాయ్ టు గౌతమ్ అదాని అని వివరించారు కేటీఆర్. ఇలాంటి వాటిపై మోడీ నుంచి కానీ, కేంద్రప్రభుత్వం నుంచి కానీ సమాధానాలు రావన్నారు. దర్యాప్తు సంస్థలు కూడా ఇలాంటి వాటిపై కేసులు పెట్టలేదన్నారు.
మొదాని డబుల్ ఇంజిన్
ఇప్పటి వరకు డబుల్ ఇంజిన్ అంటే ఏదో అనుకున్నారని.. కానీ ఒక ఇంజిన్ మోదీ అయితే రెండో ఇంజిన్ అదాని అని ఎద్దేవా చేశారు. మొదానీయే బీజేపీ వాళ్ల డబుల్ ఇంజన్ అన్నారు. మోదీ తిరిగి మార్కెటింగ్ చేస్తే అదాని సంపాదిస్తారన్నారు. ఇలా మిత్రుడు ఇచ్చిన సొమ్ముతో ప్రజలు ఎన్నుకున్న పార్టీలను కూల్చే పనిని మోదీ చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలను నాశనం చేయాలనే వీళ్ల టార్గెట్ అన్నారు. మొన్నటికి మొన్న మునుగోడులో కాంట్రాక్ట్ ఇచ్చిన ఓ పార్టీ లీడర్‌ను చేర్చుకోలేదా అని ఉదహరించారు.
స్వదేశంలో చౌకగా బొగ్గు దొరుకుతుంటే... విదేశాల్లో బొగ్గును బలవంతంగా కొనిపిస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. ఇది స్కామ్ కాదా అని ప్రశ్నించారు. ఎందుకు కొనాలంటే సమాధానం చెప్పడం లేదన్నారు. అదానీ విదేశాల్లో తీసుకున్న బొగ్గు గనుల కోసం మార్చిన పాలసీ కాదా అని ప్రశ్నించారు. ఇలా దందాలు చేసి వచ్చిన సొమ్ముతో రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడుతున్న మాట వాస్తవం కాదా అని ఆరోపించారు.
గుజరాత్‌లో 42 మంది లిక్కర్ తాగి చస్తే అది స్కామా మోడీ స్కీమా అని నిలదీశారు కేటీఆర్. అదానికి అనుకూలంగా తయారు చేసిన పాలసీలు తయారు చేసిన మీరు చేసింది స్కాం కాదా అని ప్రశ్నించారు. ఆయన బొగ్గు గనుల నుంచి బొగ్గు కొనాలని ఒత్తిడి చేయడం స్కాం కాదా... ముంద్రా పోర్టులో డ్రగ్స్ దొరికితే స్కాం కాదా... అని నిలదీశారు. మోడీకి దమ్ముందా అదానీతో ఉన్న సంబంధంపై విచారణకు రెడీనా అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అసలు ఇలాంటి స్కామ్‌లపై సమాధానం చెప్పకుండా.. మోదీ ఎప్పుడు పరీక్ష రాశారో లోదే తెలియదు కానీ... పరీక్షపే చర్చ పెడతారన్నారని కేటీఆర్ సెటైర్ వేశారు. టీ అమ్మారో లేదో తెలియదు కానీ... టీ పే చర్చ అంటారన్నారు.
అదానీతో ఉన్న సంబంధాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఈ విషయంలో మోడీకి లైడిటెక్టర్ పరీక్ష చేయాలన్నారు. దానికి సిద్ధామా అని ప్రశ్నించారు. అప్పుడు దేశానికి మోడీ నిజాయితీ తెలుస్తుందన్నారు.
ఈడీ అనేది 2014 తర్వాత చేసిన దాడుల్లో 95 శాతం ప్రతిపక్షాలపైనే అన్నారు కేటీఆర్. ఐదవేల నాలుగు వందల ఇరవై రెండు కేసుల్లో తీర్పు వచ్చింది కేవలం 23 కేసుల్లోనే అని వివరించారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ఇలా చేస్తున్నారన్నారు. ఈడీ అంటే ఎరాడికేషన్ డెమోక్రసీ అని అభిప్రాయపడ్డారు. కర్నాటకలో ఎమ్మెల్యే కుమారుడు విరూపక్ష కుమారుడు డబ్బులు తీసుకుంటూ దొరికినా కేసులు లేవన్నారు. మరో ఎంపీ మాట్లాడుతూ.. తన జోలికి ఈడీ రాదని నిర్భీతిగా చెబుతున్నారన్నారు. బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఈడీ గోల లేకుండా ప్రశాంతంగా ఉన్నానంటూ ఓ కాంగ్రెస్ ఎంపీ చెప్పారని గుర్తు చేశారు.
హిమంత్ బిశ్వ శర్మపై ఉన్న కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు కేటీఆర్. ప్రతిపక్షాలపై ఇన్ని కేసులు పెట్టిన కేంద్రం బీజేపీ నేతలపై పెట్టిన కేసులు గురించి చెప్పగలదా అని నిలదీశారు. మోడీ, అదాని స్నేహం గురించి ఇంకా ఎంత కాలం దాయగలరూ అని క్వశ్చన్ చేశారు. . కర్నాటక అత్యంత అవినీతిమైయమైంది చెబితే చర్యలు ఏమైనా తీసుకున్నారా...కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నా చర్యలు తీసుకున్నారా నిలదీశారు. మేఘాలయలో అత్యంత అవినీతిపరుడని అక్కడ సీఎంపై ఆరోపణలు చేసిన మోదీ ఆయన ప్రమాణస్వీకారానికి ఎలా వెళ్లారని ప్రశ్నించారు.
విచారణ ఎదుర్కొంటాం: కేటీఆర్
ఎమ్మల్సీ కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటారన్నారు కేటీఆర్. బీజేపీ నేతల్లా కేసులు పెడితే దాక్కోవడం కాదని బీఎల్ సంతోష్ అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు జరుగుతుందంతా పొలిటికల్ హంబక్కే తప్ప ఇంకేం లేదన్నారు.
బీజేపీ అనుబంధ సంఘాలే ఈడీ, సీబీఐ, ఐటీ
రిటైర్ అయిన వ్యక్తులను ఈ దర్యాప్తు సంస్థలతోపాటు ఎల్‌ఐసీ, ఇండసిండ్ బ్యాంక్, ఎస్‌బీఐ ఛైర్మన్‌లుగా ఎందుకు కొనసాగిస్తున్నారో తెలుసు అన్నారు కేటీఆర్. ఈడీ ఉన్నతాధికారికి రిటైర్‌మెంట్‌ను మూడుసార్లు పొడిగించారన్నారు. ఎల్‌ఐసీ ఛైర్మన్‌కు మూడుసారు పొడిగింపు ఇచ్చారన్నారు. అదానీలకు లబ్ధి చేకూర్చాలి... మోడీ చెప్పినట్టు వినాలనే ఇలాంటి వెసులుబాటు ఇస్తున్నారన్నారు. ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనా దోస్తు మాత్రం భద్రంగా ఉండాలనే మోదీ తాపత్రయం అన్నారు. వన్ నేషన్ వన్ దోస్తు అనేది మోడీ కొత్త స్లోగన్ అనిచెప్పారు.