By: ABP Desam | Updated at : 06 Aug 2021 10:11 PM (IST)
దళిత బంధు కోసం పాట రాసిన కేసీఆర్
దళితబంధును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకానికి మరింత ప్రచారం కల్పించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి కేసిఆర్. ఇందుకోసం ఆయన మరోసారి కలం పట్టారు. దళిత బంధు పథకం వల్ల ఉపయోగాలు, దళితబంధు పథకం వల్ల ఏ రకమైన ప్రయోజనాలు కలుగుతాయని అనే విషయాలను పాటల రూపంలో తీసుకువచ్చేందుకు ప్రతయ్నం చేస్తున్నారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసిఆర్ ఎమ్మెల్సీ, ప్రముఖ రచయిత గోరటి వెంకన్న, సాంస్కృతిక సారథి ఛైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్, రచయితలు, కళాకారులు కోదాడి శ్రీను, అంబటి వెంకన్న, మిట్టపల్లి సురేందర్, అభినయ శ్రీనివాస్, బోడ చంద్రప్రకాశ్, మానుకోట ప్రసాద్, ఏకే బిక్షపతి, బాబు, శివ సమావేశమై కొన్ని పాటల్ని ఫైనల్ చేశారు. సంగీతం కంటే ప్రజలు సాహిత్యాన్ని పాతుకుపోయేలా చరణాల ఆయన స్వయంగా సూచించారు. పేదలు ఇస్తున్న ఈ పదిలక్షల రూపాయలు ఎలా ఉపయోగించుకోవాలి? వీటితో ఏ ఏ రకంగా వ్యాపారాలు చేయవచ్చో అందరకీ అర్థం అయ్యేలా పాటలు ఉండాలని గీత రచయితలకు సూచనలు చేశారు. ‘దళితవాడ ప్రగతి జాడ నడిపించగ వచ్చెనో.. ముఖ్యమంత్రి కేసీయారు... దళితబంధు పథకముతో ఆత్మబంధువయ్యెనో.. ముఖ్యమంత్రి కేసీయారు... అంటూ కొనసాగనున్నాయి ఈ పాటలు. ఆడియో రూపంలో, వీడియో రూపంలో వస్తున్న ఈ పాటల్ని ఈనెల 16న విడుదల చేస్తారని సమాచారం.
తెలంగాణ ఉద్యమంలో సాహిత్యానిది ప్రత్యేక పాత్ర. తెలంగాణ ఉద్యమంలో పాటకు పెద్దపీట వేశారు టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసిఆర్. తెలంగాణ సమాజంలో ఆట, పాట, సంగీతం, సాహిత్యాన్ని బాగా ఆదరిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అంటూ ఉండేవారు. ఉద్యమ సమయంలో స్వయంగా ఆయన పాటల్ని ఎక్కువ ఎంకరేజ్ చేశారు. ముఖ్యంగా ధూంధాంలలో పాడే పాటలపై ప్రత్యేక శ్రద్ద కనబర్చేవారు. ఉద్యమ సమయంలో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాలో ఒక పాటను స్వయంగా రాశారు. గారడి చేస్తున్రు... గడబడి చేస్తున్రు... అంటూ సాగే ఈపాట జై బోలో తెలంగాణ సినిమాలోని అన్నీ పాటలతోపాటు ఇది కూడా హైలెట్ అయ్యింది. జై బోలో తెలంగాణ సినిమాలో ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ప్రముఖ నటుడు జగపతి బాబు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
2014 ఎన్నికలప్పుడు ఉద్యమ స్పూర్తిని రగిల్చే విధంగా గీతాలను తయారు చేయంచారు. టీఆర్ఎస్ ఎందుకు రావాలి? తెలంగాణను ఏవిధంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనే విషయాలను తెలియజేసే విధంగా కొన్ని పాటలు స్యయంగా రాయించారు. అప్పటి పాటల్లో ఎక్కువ విషయం ప్రజలకు అర్థం అయ్యేలా ఉండేలా చూడాలని రచయితలకు సూచించేవారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా కేసిఆర్ పెన్ పవర్ చూపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి, టీఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలపై రెండు రోజులపాటు గీత రచయితలతో కూర్చొని వర్క్ షాప్ నిర్వహించి పాటలు రాయించారు. మనవతకు మారు పేరు కెసిఆర్‌యు మళ్లీ గెలిచి రావాలి మనసుగళ్ల సర్కారు’అంటూ కొన్ని పాటలు రాయించారు. కొన్ని పాటల చరణాలను, పల్లవులను కొన్నింటిని ఆయన మార్చారు కూడా. పాట ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఉపయోగపడాలని అని అనేవారు. ఆడియో మరియు వీడియో ఫార్మాట్లలోని ఈ పాటలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఆయుధాలుగా మారుతాయని ఆయన అభిప్రాయం.
అయితే పార్టీ అధినేతలే పాటలు రాయడం చాలా అరుదు. స్వతంహాగా తెలుగు లిటరేచర్ మీద అభిమానంతోపాటు, ఎంఏ తెలుగు లిటరేచర్ చదివిని కేసిఆర్ మొదటినుంచి సాహిత్యానికి పెద్ద పీట వేసేవారు. ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో జరిగినప్పుడు ఆయన సాహితీవేత్తలను, కళాకారులను పెద్ద ఎత్తున హైదరాబాద్ రప్పించి సభలు, సమావేశాలు నిర్వహించారు. కొన్ని సభల్లో ఆయన స్వయంగా పాల్గొని పద్యాలు కూడా పాడారు. మన పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో కూడా డిఎంకే అధినేత దివంగత కరుణానిధి స్వయంగా రచయిత కావడంతో డిఎంకె పార్టీ పాటలు ఆయన రాసేవారు. కరుణానిధి పాటలు డిఎంకె పార్టీ పురోగతికి ఉపయోపడ్డాయి కొందరు నేతలు చెబుతూ ఉండేవారు. దళిత బంధు స్కీంతో సీఎం కేసిఆర్ మరోసారి కలంపట్టడం.. ఆయన రాసిన పాటలు ఎలా ఉండబోతున్నాయనేది అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నరు.
Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్, ముచ్చటగా మూడోసారి
Hyderabad: నేడు Hydకి మోదీ, ఈ రూట్లలో ట్రాఫిక్కు నో ఎంట్రీ! ముందే వేరే మార్గాలు చూసుకోండి
Modi Hyderabad Tour Today: నేడే హైదరాబాద్కు ప్రధాని, రంగంలోకి 2 వేల మంది పోలీసులు - పూర్తి షెడ్యూల్ ఇదీ
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా
Telangana Police Jobs: పోలీసు ఉద్యోగాలకు ఇంకా అప్లై చేయలేదా? ఇవాళే లాస్ట్ డేట్!
Amalapuram Violence: అమలాపురం అల్లర్ల కేసులో కీలక వ్యక్తి అరెస్టు, అసలు ఎవరీ అన్యం సాయి?
Khammam: సీఎం జగన్పై తెలంగాణ మంత్రి వ్యాఖ్యల దుమారం! అదే పనిగా విమర్శలు, అందులో ఆంతర్యంటి?
AP Ministers Bus Tour: శ్రీకాకుళం టు అనంతపురం- నేటి నుంచే ఏపీ మంత్రుల బస్సు యాత్ర