Jubilee Hills Minor Girl Case: ఉస్మానియ ఆసుపత్రికి జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసు నిందితులు, ఏ-1కు వైద్యపరీక్షలు పూర్తి
Jubilee Hills Minor Girl Case: జూబ్లీహిల్స్ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసు విచారణ నేడు మొదలైంది. ఇందులో భాగంగా ఐదుగురు మైనర్లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
Jubilee Hills Gang Rape Case : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసు విచారణ నేడు మొదలైంది. ఇందులో భాగంగా ఐదుగురు మైనర్లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మొదట జువైనల్ హోంకు వెళ్లిన పోలీసులు ఐదుగురు మైనర్లను జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. మేజర్, ఈ కేసులో ఏ1 అయిన సాదుద్దీన్ తో పాటు ఈ కేసులో అందరూ నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులందరికి ఉస్మానియాలోని ఫోరెన్సిక్ విభాగంలో లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రికి తరలించారు.
మైనర్లకు, ఏ-1కు ఉస్మానియాలో వైద్యపరీక్షలు
కోర్టును వారం రోజుల కస్టడీ కోరగా మూడు రోజులపాటు కస్టడీకి అనుమతి లభించింది. దాంతో ఇవాళ్టి నుంచి ఈ నెల 14వరకు మూడు రోజులపాటు విచారణ ప్రక్రియ కొనసాగనుంది. మైనర్ల విచారణకు జువైనల్ హోమ్‌లో ఏర్పాట్లు చేయాలని పోలీసులు పర్యవేక్షకుడిని కోరారు. నేటి ఉదయం మైనర్ నిందితులో పాటు ఏ1 సాదుద్దీన్‌ను కస్టడీలోకి తీసుకున్ పోలీసులు.. జువైనల్ హోమ్ నుండి ఉస్మానియా ఆసుపత్రికి మైనర్ నిందితులను, సాదుద్దీన్‌ను తరలించారు. అక్కడ మొదట ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌కు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు.
మైనర్లకు సైతం వైద్య పరీక్షలు..
మైనర్లకు ప్రత్యేకంగా వైద్య నిర్వహించాలని భావించారు. కానీ ప్రత్యేక ఏర్పాట్లు చేయలేమని పర్యవేక్షకుడు స్పష్టం చేయడంతో వారిని మూడు ప్రైవేట్ వాహనాలలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ముఖాలకు మాస్కులు వేసి ఒక్కోకరిని ఫోరెన్సిక్ విభాగంలోకి పోలీసులు తరలిస్తున్నారు. ఈ వైద్య పరీక్షకు సుమారు రెండు గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. వైద్య పరీక్షల అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఆరుగురు నిందితులను తరలించనున్నారు.
మూడు రోజులపాటు విచారణ..
కోర్టు మూడు రోజులక కస్టడీకి ఇవ్వడంతో ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు జువైనల్ హోమ్ నుంచి తరలించి జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లోనే విచారించాలని పోలీసులు నిర్ణయించారు. విచారణ పూర్తయిన తరువాత ప్రతిరోజూ సాయంత్రం తిరిగి జువైనల్ హోమ్‌లో మైనర్ నిందితులను అప్పగించనున్నారు. కాగా, గత నెల 28న అమ్నీషియా పబ్‌కు వెళ్లిన మైనర్ బాలికను కొందరు మైనర్లు, ఓ మేజర్ మాయమాటలు చెప్పి ఇంటి వద్ద డ్రాప్ చేస్తామన్నారు. కారులో తీసుకెళ్లిన నిందితులు ఒకరితర్వాత ఒకరు సామూహిక అత్యాచారం చేశారు. మూడు రోజుల తరువాత బాధిత బాలిక కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా, ఆలస్యంగా కేసు నమోదు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మైనర్లు ఉన్నందున వివరాలు గోప్యంగా ఉంచామన్నారు.
Also Read: Karimnagar: యువకుడి హత్య కేసులో నమ్మలేని నిజం - అతని ఫ్యామిలీ మొత్తం అవాక్కు!