అన్వేషించండి

ఎమ్మెల్యే కొనుగోలు కేసులో దర్యాప్తు వేగవంతం- ఏక కాలంలో ఐదు రాష్ట్రాల్లో సిట్‌ అధికారుల తనిఖీలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇటీవలే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. సీవీ ఆనంద్‌ నేతృత్వంలో ఈ సిట్ పని చేస్తోంది.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసు దర్యాప్తు స్పీడ్ అందుకుంది. దీనిపై ప్రభుత్వం వేసిన సిట్‌... తెలంగాణసహా వివిధ రాష్ట్రాల్లో తనిఖీలు చేస్తోంది. కర్నాటక, హర్యానా, కేరళ, ఏపీ, తెలంగాణలో తనిఖీలు చేస్తోంది.  కేరళలోని రామచంద్రభారతికి సన్నిహిత వైద్యుడు ఆసుపత్రిలో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల సంగతి తెలుసుకున్న ఆయన అక్కడి నుంచి జారుకున్నట్టు సమాచారం. రామచంద్రభారతికి, తుషార్‌కు ఉమ్మడి స్నేహితుడిగా ఆ వైద్యుడు ఉన్నట్టు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే అక్కడ కూడా తనిఖీలు చేస్తున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఏపీ, కేరళ, హరియాణా, కర్ణాటక, హైదరాబాద్ లో సిట్ అధికారుల బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. హరియాణా, కర్ణాటకలోని రామచంద్ర భారతి నివాసాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అలాగే తిరుపతిలోని సింహయాజీ స్వామీజీ ఆశ్రమంలో సిట్ సోదాలు చేస్తుంది. కేరళలోని ఓ డాక్టర్ ఇంట్లో సిట్ బృందం తనిఖీలు చేసినట్లు సమాచారం. రామచంద్ర భారతికి కొచ్చిలో ఉండే డాక్టర్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే సిట్ తనిఖీల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సింహయాజీ తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి ఓ జాతీయ పార్టీ నేత బంధువు ఫ్లైట్‌ టికెట్ బుక్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.

నందకుమార్ అక్రమ నిర్మాణాలు కూల్చివేత 

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడు నందకుమార్ కు చెందిన చెందిన అక్రమ నిర్మాణాలు జీహెచ్ఎంసీ ప్లానింగ్ సిబ్బంది కూల్చివేసింది. నిర్మాత దగ్గుపాటి సురేశ్ బాబుకు చెందిన స్థలాన్ని నందకుమార్ లీజుకు తీసుకున్నారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా దక్కన్ కిచెన్ ప్రాంగణంలో రెండు అక్రమ నిర్మాణాలు చేపట్టారు.  ఈ విషయం నిర్మాత సురేష్ బాబు అధికారులకు ఫిర్యాదు చేయగా.. స్పందించిన అధికారులు నందకుమార్ కు నోటీసులు ఇచ్చారు. అక్రమంగా నిర్మిస్తున్న భవనం నిర్మాణ పనులను వెంటనే ఆపేయాలని తెలిపారు. అయినప్పటికీ నంద కుమార్ పట్టించుకోకపోవడంతో ఫిలింనగర్ లో ఉన్న నందకుమార్ అలియాస్ నందు హోటల్ డెక్కన్ కిచెన్ భవనాన్ని కూల్చి వేశారు. అయితే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  

ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముందుకు సాగుతోంది. తెలంగాణ సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. ముగ్గురు నిందితుల రెండు రోజుల కస్టడీ కూడా పూర్తయింది. రెండు రోజుల్లో తెలుసుకోగలిగినంత సమాచారం తెలుసుకున్నారు.  కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. 23 మంది ముఠా ఉందని అందరికీ తెలిసింది. వీళ్లెవరు ? ఎక్కడెక్కడ ఉంటారు ? వారందర్నీ ఎలా పట్టుకొస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ కేసులో ముందుగానే విడుదల చేసిన సాక్ష్యాలు ఎంత వరకూ చెల్లుతాయనే సందేహం ఉండనే ఉంది. ఈ క్రమంలో అన్నీ వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ఆ నలుగురు ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తారా లేదా అన్న చర్చ కూడా ప్రారంభమయింది. 

ఎమ్మెల్యేలకు బెదిరింపులు 

తెలంగాణలో కొద్ది రోజులుగా ఎమ్మె్ల్యేల కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై విచారణ కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు టీమ్ దీనిపై విచారణ జరుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన వికారాబాద్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ మేరకు తనకు అపరిచిత వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  తనకు ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన దాదాపు 11 నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్‌ వచ్చాయని ఫిర్యాదులో చెప్పారు. ఆ ఫోన్ కాల్స్ చేసిన వారిలో కొంత మంది తనను హత్య చేస్తామంటూ బెదిరించినట్టుగా రోహిత్‌ రెడ్డి పోలీసులకు చెప్పారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే మరో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
LB Nagar Police Constable Suicide: ఎల్బీ నగర్ పీఎస్‌లో ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
ఎల్బీ నగర్ పీఎస్‌లో ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget