By: ABP Desam | Updated at : 23 Sep 2021 11:14 AM (IST)
Edited By: Sai Anand Madasu
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బయోమెట్రిక్ టోకెన్ మెషిన్
పరిగెత్తుకుంటూ.. వచ్చి... చెమటలు వస్తుంటే.. రైలులో ఒక్కసీటు కోసం ఎంత కష్టపడిపోతామో కదా. అదృష్టం బాగుంటే దొరుకుతుంది. ఒక్కోసారి అస్సలు దొరకదు. గమ్యస్థానం వరకూ నిలబడే ఉండాలి. ఇలాంటి సమస్యలకు దక్షిణమధ్య రైల్వే ఒక టోకెన్‌తో పరిష్కారాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాధారణ బోగీల్లో ప్రయాణం చేసేవారు ఒక్క టోకెన్ తీసుకొంటే చాలు.. సీటులో కూర్చొని ప్రశాంతంగా వెళ్లొచ్చు.
భారతీయ రైల్వే బయోమెట్రిక్ టోకెన్ మెషిన్ సేవలను ప్రారంభించింది. ప్రయాణికుల రద్దీని తగ్గించడంతోపాటు.. క్యూలో నిల్చుని ఇబ్బందులు పడేవారి కోసం మెుదటిసారిగా సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో బయోమెట్రిక్ టోకెన్ మెషిన్ ను ప్రారంభించారు.
అన్‌రిజర్వుడ్ కోచ్‌లలో ప్రయాణించే వారు క్యూలైన్లలో నిల్చోవలసిన అవసరం లేకుండా, ప్రయాణికులలో గందరగోళం, తొక్కిసలాట వంటివి చోటుచేసుకోకుండా బయోమెట్రిక్ టోకెన్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ యంత్రంలో మొదట ప్రతి ప్రయాణికుడి పేరు, రైలు నంబరు, పీఎన్‌ఆర్ నంబరు, వెళ్లవలసిన స్టేషన్, తదితర వివరాలను నమోదు చేస్తారు. ప్రయాణికుల బయోమెట్రిక్ సమాచారంలో భాగంగా వారి వేలిముద్రలు, ఫొటోగ్రాఫ్ తీసుకుంటారు. అనంతరం బయోమెట్రిక్ యంత్రం ఆటోమెటిక్‌గా ఒక సీరియల్ నంబరుతో టోకెన్‌ను అందజేస్తుంది.
ఈ టోకెన్ నంబర్ ప్రకారం ప్రయాణికులు వారికి కేటాయించిన కోచ్‌లలోనే రైలు ఎక్కాలి. ప్రయాణికులు టోకెన్ తీసుకున్నాక కోచ్ వద్దకు ప్రయాణ సమయానికి 15 నిమిషాలు ముందుగానే చేరుకోవచ్చు.
ఈ టోకెన్ ద్వారా ప్రయాణికుల భద్రతకు భరోసా ఉంటుంది. జనరల్ బోగీల్లో ప్రయాణం చేసే ప్రతి ప్రయాణికుడి ఫొటో, వేలిముద్రలు నమోదు కానున్న దృష్ట్యా నేరాల నియంత్రణ ఉంటుంది. ప్లాట్ ఫారాల వద్ద రద్దీ నియంత్రణ ఉంటుంది. బోర్టింగ్ సమయంలో క్యూలో నిల్చున్న వారిని నియంత్రించేందుకు ఆర్పీఎఫ్ సిబ్బంది ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు.
Also Read: KTR: కమిటీ నిర్మాణాల జాబితాలను 24లోగా పంపండి.. పార్టీ నేతలకు మంత్రి కేటీఆర్ సూచన..
Also Read: TSRTC News: ఆర్టీసీకి 4 నెలలు టైం ఇచ్చిన కేసీఆర్.. లేదంటే ఇక అదే జరుగుతుందని హెచ్చరిక
Also Read: Petrol-Diesel Price, 23 September: పెరిగిన ఇంధన ధరలు.. ఇక్కడ భారీ తగ్గుదల, కొన్ని చోట్ల స్థిరం
Also Read: Crime News: నీకు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి.. తెలివి పెంచుతానంటూ.. బాలికను గర్భవతి చేసిన మాస్టారు
Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
KTR IN Davos: తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ- ఆగస్టు నుంచి స్విస్‌రే కంపెనీ కార్యకలాపాలు, ట్విట్టర్లో ప్రకటించిన కేటీఆర్
Hyderabad Ganja Seize : హైదరాబాద్ లో భారీగా గంజాయి సీజ్, మహిళలకు కమీషన్ ఆశ చూపి స్మగ్లింగ్
Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!
Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ
Simple Hacks: పచ్చి మాంసాన్ని ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో తాజాగా ఉంచాలంటే ఈ చిట్కాలు పాటించండి
AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !
Guppedantha Manasu మే 24 ఎపిసోడ్: వసుధారకు అసలు సంగతి చెప్పడానికి రెడీ అయిన రిషి- వెడ్డింగ్ డిజైన్ చేసిన మహేంద్ర