అన్వేషించండి

HYDRA: రూ.18,000 కోట్ల విలువైన భూమి రికవరీ, బ‌తుక‌మ్మ‌కుంట ముమ్మాటికీ చెరువే: రంగనాథ్

Bathukamma Kunta | రూ. 18,000 కోట్ల విలువైన 2,093 ఎకరాల భూములను రికవరీ చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బతుకమ్మ కుంట ఆక్రమణలపై ఆధారాలతో కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.

HYDRA Commissioner Ranganath | హైదరాబాద్‌:  హైడ్రా చేపట్టిన చర్యల ద్వారా ఇప్పటివరకూ 2 వేలకు పైగా ఎకరాల ప్రభుత్వ భూమిని రికవరీ చేయగా.. వాటి విలువ రూ.18000 కోట్లకు పైగా ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా కార్యాల‌యంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో అంబ‌ర్‌పేట‌లోని బతుకమ్మ కుంట అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని హైడ్రా (HYDRA) కమిషనర్ తెలిపారు. ఈ వివాదానికి సంబంధించి ఎడ్ల సుధాకర్ అనే వ్యక్తికి 1986 నాటి అన్‌రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఉంటేనే అది చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. గతంలో సుధాకర్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా అతడు పొజిషన్‌లో లేడని పేర్కొంది. కోర్టు ఆదేశాల ప్రకారమే తాము అక్కడ ఉన్న బోర్డులు, ఇతర నిర్మాణాలను తొలగించామని రంగనాథ్ వివరించారు.

బతుకమ్మ కుంటపై నాసా ఆధారాలున్నాయి

సుధాకర్ అక్కడ అసలు చెరువే లేదని వాదిస్తున్నారని, కానీ అందులో ఏమాత్రం నిజం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొట్టిపారేశారు. 1975లో ఇరిగేష‌న్ రికార్డుల్లో కుంట‌గా పేర్కొన్న ఆధారాల‌ను చూపించారు. స‌ర్వే నంబ‌రు 563/1 లో 9.19 ఎక‌రాల వ‌ర‌కూ చెరువున్నట్టు రెవెన్యూ, జీహెచ్ ఎంసీ రికార్డులు ఉన్నాయని తెలిపారు. ఆ చెరువుకు క‌ట్ట 563/2 స‌ర్వే నంబ‌రులో 6 గుంట‌ల మేర మాసాన్ క‌ట్ట పేరిట ఉంద‌న్నారు. 1990 నాటి నాసా (NASA) శాటిలైట్ ఫోటోలతో పాటు, 1970 నాటి భారత నీటి సర్వేల రికార్డులను పరిశీలిస్తే అక్కడ పూర్వం నుంచే బతుకమ్మ కుంట ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ ఫొటోలు, వీడియోల‌ను స‌రిపోల్చుతూ రూపొందించిన వీడియోను ఈ సందర్భంగా ఆయన ప్ర‌ద‌ర్శించారు. పహానీలలో కూడా ఈ చెరువు బతుకమ్మ కుంట, ఎర్రకుంట పేర్లతో నమోదై ఉందని తెలిపారు. సుధాకర్ భూమిని తాము చెరువుగా మార్చామనే ఆరోపణలు వాస్తవం కాదని, తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. 


HYDRA: రూ.18,000 కోట్ల విలువైన భూమి రికవరీ, బ‌తుక‌మ్మ‌కుంట ముమ్మాటికీ చెరువే: రంగనాథ్

బ‌తుక‌మ్మ కుంటపై తుది తీర్పు వ‌చ్చే వ‌ర‌కూ దీనిమీద ఎవ‌రూ ఓన‌ర్‌షిప్‌ క్లెయిమ్ చేయ‌కూడ‌ద‌నే కోర్టు నిబంధ‌న‌ల మేర‌కు బోర్డులు, గేట్లు తొల‌గించామ‌ని తెలిపారు. బతుకమ్మ కుంట చెరువు చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ను తొల‌గిస్తే ప్ర‌మాదాలు జ‌రుగుతాయ‌ని సుప్రింకోర్టులో జ‌రిగిన విచార‌ణ సంద‌ర్భంగా తెలిపినట్లు చెప్పారు. వివ‌ర‌ణ‌తో 3 వారాల్లో అఫ‌డ‌విట్‌ను దాఖ‌లు చేయాలనిమ‌ని సోమ‌వారం సుప్రీంకోర్టు సూచించింద‌ని రంగనాథ్ తెలిపారు.

హైడ్రా కూల్చివేతలు, చర్యలపై కమిషనర్ రంగనాథ్

ఇతర ప్రాంతాల్లో చేపట్టిన ఆక్రమణల తొలగింపులపై కూడా రంగనాథ్ వివరాలు అందించారు. నార్సింగిలోని ముష్కిన్ చెరువు ఆక్రమణల కూల్చివేతలపై ముందుగానే సమాచారం ఇచ్చామని తెలిపారు. అలాగే సున్నం చెరువు బాధితులతో సమావేశం ఏర్పాటు చేశామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ఐలాపూర్‌లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై డ్రైవ్ చేపట్టామని, అక్కడ బాధితులంతా పేదలే ఉన్నందున 1500 ఇళ్లను కూల్చివేయలేదని స్పష్టం చేశారు. ఫాతిమా కాలేజీ వివాదంలో హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎఫ్‌టీఎల్ (FTL) డిమార్కేషన్ చేయాల్సి ఉందని తెలిపారు.

2093 ఎకరాలు రికవరీ చేసిన హైడ్రా

హైడ్రా ఇప్పటివరకు చేపట్టిన చర్యల ద్వారా 2,093 ఎకరాల భూమిని రికవరీ చేసిందని రంగనాథ్ వెల్లడించారు. మార్కెట్ ధరల ప్రకారం ఈ భూముల విలువ సుమారు రూ.18,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఆక్రమణలు, ఇతర నిబంధనల ఉల్లంఘనలపై ఇప్పటివరకు హైడ్రా పరిధిలో 90 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల రక్షణే ధ్యేయంగా హైడ్రా తన కార్యకలాపాలను కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget