అవును, హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందని ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూల్చివేతలు నిలిపివేయాలని హైకోర్టు స్పష్టం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
HYDRAA Fact Check: హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్!
HYDRAA Fact Check: హైడ్రా స్పీడ్‌కు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసిందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దీన్ని నిర్దారిస్తూ ఓ డాక్యుమెంట్ కూడా వైరల్ అవుతోంది. దీనిపై హైడ్రా కూడా స్పందించింది.

- హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆదేశాలంటూ తప్పుడు ప్రచారం.
- హైకోర్టు పేరుతో వచ్చిన నోటీసులు నకిలీవని హైడ్రా స్పష్టీకరణ.
- తప్పుడు ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు హైడ్రా ఫిర్యాదు.
- ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ.
HYDRAA Fact Check: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక సంస్థ హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గత కొద్ది రోజులుగా నగరవ్యాప్తంగా అక్రమ నిర్మాణాల తొలగింపులో దూకుడు ప్రదర్శిస్తున్న హైడ్రాకు ఇది బిగ్ షాక్ అని వైరల్ అవుతోంది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూల్చివేతలు నిలిపివేయాలనే హైకోర్టు స్పష్టం చేసినట్టు ప్రచారం సాగుతోంది.
ఫేక్ ప్రచారంపై హైడ్రా కీలక ప్రకటన!
హైడ్రా పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని హైడ్రా ఖండించింది. ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఆ నోటీసులు పూర్తిగా నకిలీవని స్పష్టం చేసింది.
ఈ ఫేక్ ప్రచారంపై హైడ్రా తీవ్రంగా స్పందించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాని మండిపడింది. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుకు అధికారికంగా ఫిర్యాదు కూడా చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, న్యాయస్థానాల గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైడ్రా కోరింది.
హైడ్రా కార్యకలాపాలను పరిశీలించిన హైకోర్టు, ఈ సంస్థకు ఇప్పటి వరకు ఒక నిర్ధిష్టమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేకపోవడాన్ని తప్పుపట్టిందని సర్క్యులేట్ అవుతున్న డాక్యుమెంట్‌లో ఉంది. ఏడాది కాలం గడుస్తున్నా, నిబంధనలు రూపొందించకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని నోటీసుల్లో పేర్కొన్నట్టు ఉంది. నోటీసులు ఇవ్వకుండా ఇష్టానుసారంగా కూల్చివేతలు చేపట్టడం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ కాదని కూడా కోర్టు అభిప్రాయపడినట్టు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా అమీన్‌పూర్ పరిిలో జరిగిన కూల్చివేతలకు సంబంధించిన వీడియోను పరిశీలించిన తర్వాత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసిందని కూడా అందులో ఉంది. అయితే ఇవన్నీ కూడా హైడ్రాను దెబ్బతీసేందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని అధికారులు మండిపడ్డారు.
హైదరాబాద్‌లోని సహజ వనరులను కాపాడటానికి హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు తీరుపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేసేటప్పుడు కనీస గడువు ఇవ్వడం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కొందరి నుంచి వస్తున్న విమర్శలనే కోర్టు ఆదేశాలు అంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపై హైడ్రా ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు.
Frequently Asked Questions
హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని ప్రచారం జరుగుతోందా?
హైడ్రా ఈ ప్రచారానికి ఎలా స్పందించింది?
హైడ్రా ఈ ప్రచారాన్ని ఖండించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న నోటీసులు నకిలీవని స్పష్టం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలిపింది.
హైడ్రా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిందా?
అవును, హైడ్రా ఈ ఫేక్ ప్రచారంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, న్యాయస్థానాల గౌరవాన్ని కించపరిచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
కూల్చివేతలకు నిర్ధిష్ట స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేకపోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిందని ప్రచారం అవుతోందా?
సర్క్యులేట్ అవుతున్న డాక్యుమెంట్ ప్రకారం, హైకోర్టు ఈ సంస్థకు ఇప్పటి వరకు ఒక నిర్ధిష్టమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేకపోవడాన్ని తప్పుపట్టిందని, ఏడాది కాలం గడుస్తున్నా నిబంధనలు రూపొందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిందని ప్రచారం జరుగుతోంది.
ట్రెండింగ్ వార్తలు





















