Hyderabad News: ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జగజ్యోతి అరెస్ట్ - ఇంట్లో 65 లక్షల నగదు, 4 కిలోల బంగారం
ACB Raids: జగ జ్యోతి రూ.84 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు సోమవారం (ఫిబ్రవరి 19) దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆమె ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
![Hyderabad News: ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జగజ్యోతి అరెస్ట్ - ఇంట్లో 65 లక్షల నగదు, 4 కిలోల బంగారం Hyderabad Tribal welfare EE Jaga Jyothi arrested by ACB official in bribe case and produced in court Hyderabad News: ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జగజ్యోతి అరెస్ట్ - ఇంట్లో 65 లక్షల నగదు, 4 కిలోల బంగారం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/20/1259719e07bdfcab5863519b08dfd7c81708407708301234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tribal Welfare Officer Arrest: హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా పని చేస్తున్న జగ జ్యోతిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. జగ జ్యోతి రూ.84 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు సోమవారం (ఫిబ్రవరి 19) దొరికిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ జగ జ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో ఎక్కడపడితే అక్కడ నగదు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అలా మొత్తం ఆమె ఇంట్లో రూ.65 లక్షల నగదుతో పాటు 4 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. జ్యోతి ఇంట్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు.
మాసబ్‌ట్యాంక్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఆఫీస్‌లో జగజ్యోతి ఇంచార్జి సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. ఓ బిల్డింగ్ కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేలు లంచం తీసుకుంటూ సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
ఆమె లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అనంతరం పక్కా ప్రణాళికతో డబ్బు తీసుకుంటుండగా ఆమెను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అధికారులు పట్టుకున్న అనంతరం ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె కార్యాలయంతో పాటు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.
Executive Engineer at Tribal Welfare department in Hyderabad caught red-handed taking ₹84,000 bribe.
— Sudhakar Udumula (@sudhakarudumula) February 19, 2024
Anti-Corruption Bureau apprehended K. Jaga Jyothi, Executive Engineer, Tribal Welfare Engineering Department at Tribal Bhavan, #Masabtank #Hyderabad when she demanded and… pic.twitter.com/w9ayxg1aWu
ఇటీవలే నల్గొండలోనూ
కొద్ది రోజుల క్రితమే నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఔషధాల టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి సూపరింటెండెంట్ లచ్చు నాయక్ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. పక్కా ప్లాన్ తో వెంకన్న నుంచి లచ్చు నాయక్ ఆయన నివాసంలో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వారం రోజుల క్రితం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట తహసీల్దార్ ను సైతం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టాదార్ పాస్ బుక్ జారీ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి తహసీల్దార్ సత్యనారాయణ లంచం డిమాండ్ చేయగా.. బాధితుని ఫిర్యాదుతో పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు ఆ అధికారి పని పట్టారు. ఎమ్మార్వో డ్రైవర్ రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్వో తీసుకోమంటేనే తాను డబ్బు తీసుకున్నట్లు డ్రైవర్ అంగీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)