అన్వేషించండి

AI Copwriter Hyderabad Police: Hyderabad హైదరాబాద్ పోలీసుల వినూత్న ప్రయత్నం! దేశంలోనే తొలి ఏఐ కాప్‌రైటర్ యాప్ ప్రారంభం!

AI Copwriter Hyderabad Police: హైదరాబాద్‌ పోలీస్ దేశంలోనే తొలిసారి ఏఐ కాప్‌రైటర్‌ యాప్‌ను ప్రారంభించింది. పది భాషల్లో ఫిర్యాదులు తీసుకొని బాధితులకు వేగంగా న్యాయం అందించడమే ఈ టెక్నాలజీ లక్ష్యం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హైదరాబాద్ పోలీసులు AI ఆధారిత ఫిర్యాదుల యాప్ ప్రారంభించారు.
  • ఈ యాప్ పది భాషలలో ఫిర్యాదులను టెక్స్ట్ గా మారుస్తుంది.
  • విదేశీయులు, వలస కార్మికులకు ఇది పోలీసు సేవలు అందిస్తుంది.
  • భాషా అడ్డంకులను తొలగించి, న్యాయ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.

AI Copwriter Hyderabad Police: హైదరాబాద్‌ మరోసారి దేశానికే ఆదర్శంగా నిలిచింది. శాంతిభద్రతల పరిరక్షణలో ఇప్పటికే టెక్నాలజీని వాడుకోవడంలో ముందు ఉన్న హైదరాబాద్‌ పోలీసులు ఇప్పుడు ఆర్టిఫిషియ్ ఇంటెలిజెన్స్‌ సాయంతో సామాన్యుడికి మరింత చేరువయ్యేందుకు ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. విదేశీయులు, వివిధ రాష్ట్రాల ప్రజలు ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు ఎదురయ్యే ప్రధాన సమస్య భాష. దీనికి శాశ్వత పరిష్కారమే AI కాప్‌రైటర్ యాప్. 

శనివారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్ అండ్ కంట్రోల్‌ సెంటర్‌లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్‌ ఈ యాప్‌ను లాంచ్‌ చేశారు. భారత్‌లోనే ఇటువంటి ఏఐ ఆధారిత బహుభాషా ఫిర్యాదులు నమోదు వ్యవస్థ ఇదే మొదటిదని చెప్పారు. 

ఏంటీ ఏఐ కాప్‌రైట్‌

సాధారంగా ఒక బాధితుడు తనకు రాని భాషలో ఫిర్యాదు చేయాల్సి వస్తే, ఆ బాధ వర్ణనాతీతం. ఆ గ్యాప్‌ను భర్తీ చేసేదే ఈ ఏఐ కాప్‌రైటర్. ఇది ఒక అత్యాధునిక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్. హిందీ, తమిళం, బెంగాళీ, మరాఠీ సహా మొత్తం పది రకాల భాషలను ఇది గుర్తిస్తుంది. బాధితుడు తన మాతృభాషలో ఫిర్యాదును చెబితే ఈ యాప్‌ ఆ మాటలను తక్షణమే టెక్ట్స్ రూపంలోకి మార్చి, పోలీసులకు అర్థమయ్యే భాషలోకి మారుస్తుంది. 

హైదరాబాద్‌ ఇప్పుడు గ్లోబల్ సిటీ. ఇక్కడ కేవలం తెలుగు వారే కాదు, వేల సంఖ్యలో విదేశీయులు, లక్షల సంఖ్యలో ఇతర రాష్ట్రాల వలస కార్మికులు ఉంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తెలుగు లేదా ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం లేక తమకు జరిగిన అన్యాయాన్ని సరిగా వివరించలేకపోతున్నారు. ట్రాన్స్‌లేటర్స్‌ కోసం ఎదురు చూడటం వల్ల ఫిర్యాదు నమోదులో గంటల కొద్దీ ఆలస్యం జరుగుతుంది. బాధితుడు చెప్పిన మాటలకు, పోలీస్‌లు రాసుకున్న మాటలకు మధ్య అర్థం మారే ప్రమాదం ఉంది. ఏఐ వాడటం వల్ల బాధితుడి ప్రతి మాట యథాతథంగా రికార్డ్ అవుతుంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, వలస కూలీలకు పోలీసుల సేవలపై నమ్మకాన్ని పెంచడానికి ఈ టెక్నాలజీ తోడ్పడుతుందని కమిషనర్‌ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. 

ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది?

ఈ యాప్‌ ప్రారంభం మే 23న జరిగింది. తొలుత హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 80కంటే ఎక్కువ పోలీస్ స్టేషన్‌లలో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇకపై భాష రాని కారణంగా ఏ బాధితుడు కూడా పోలీస్ స్టేషన్‌్ మెట్లు ఎక్కడానికి వెనుకాడాల్సిన పని లేదు. 

యాప్ ఎలా పని చేస్తుంది?

ఈ యాప్ పని తీరు అత్యంత పారదర్శకంగా , వేగంగా ఉంటుంది. బాధితులు చెప్పే విషయాల ఆడియోను టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది. సెకన్ల వ్యవధిలోనే పోలీస్‌ ఆఫీసర్ స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తుంది. ప్రతి ఐదు సెకన్లకు సమాచారం అప్డేట్ చేస్తుంది. ఫిర్యాదు నమోదు కాగానే అది ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ రూపంలోకి మారుతుంది. రికార్డు చేసిన ఫిర్యాదు ఎవరు మార్చడానికి లేదా టాంపరింగ్ చేయడానికి వీలు లేదు. ఇందులో ఫిర్యాదు తీసుకున్న అధికారి పేరు, కచ్చితమైన సమయం ఆటోమేటిక్‌గా నమోదు అవుతుంది. బాధితులు చెప్పినవి, నిందితుడి వాంగ్మూలం, సాక్షుల సాక్ష్యాలను ఈ యాప్ విడి విడిగా రికార్డు చేస్తుంది. 

యాప్ వెనుకున్నది ఎవరు?

ఈ వినూత్న ఆలోచనను వాస్తవరూపంలోకి తీసుకురావడానికి హైదరాబాద్ పోలీసులు బ్లూకౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్‌ తో కలిసి పని చేస్తున్నారు. ఈ యాప్ ఫిర్యాదులు తీసుకోవడమే కాదు కోర్టులో నిందితులకు శిక్ష పడేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బాధితుడు చెప్పిన ప్రతి మాటను యథాతథంగా రికార్డు చేయడం వల్ల కేసు దర్యాప్తులో స్పష్టత ఉంటుంది. దీని వల్ల తప్పుడు సమాచారం నమోదు అయ్యే ఛాన్స్ ఉండదు. తద్వారా న్యాయస్థానాల్లో కేసు బలంగా నిలబడుతుంది. 

Frequently Asked Questions

హైదరాబాద్ పోలీసులు కొత్తగా లాంచ్ చేసిన AI కాప్‌రైటర్ యాప్‌ అంటే ఏమిటి?

AI కాప్‌రైటర్ అనేది ఒక అత్యాధునిక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్. ఇది బాధితులు తమ మాతృభాషలో చెప్పిన ఫిర్యాదులను టెక్స్ట్ రూపంలోకి మార్చి, పోలీసులకు అర్థమయ్యే భాషలోకి అనువదిస్తుంది.

ఈ AI కాప్‌రైటర్ యాప్‌ ఎన్ని భాషలకు మద్దతు ఇస్తుంది?

ఈ యాప్‌ హిందీ, తమిళం, బెంగాళీ, మరాఠీ సహా మొత్తం పది రకాల భాషలను గుర్తిస్తుంది. దీనితో విదేశీయులు, ఇతర రాష్ట్రాల వారు సులభంగా ఫిర్యాదు చేయవచ్చు.

AI కాప్‌రైటర్ యాప్‌ ఎలా పనిచేస్తుంది?

బాధితులు చెప్పే విషయాల ఆడియోను ఇది సెకన్ల వ్యవధిలో టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది. సమాచారం నిరంతరం అప్డేట్ అవుతుంది మరియు రికార్డు చేసిన ఫిర్యాదును మార్చడం లేదా టాంపరింగ్ చేయడం సాధ్యం కాదు.

ఈ AI కాప్‌రైటర్ యాప్‌ను ఎవరు అభివృద్ధి చేశారు?

హైదరాబాద్ పోలీసులు బ్లూకౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్‌ తో కలిసి ఈ వినూత్న ఆలోచనను వాస్తవరూపంలోకి తీసుకువచ్చారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget