అన్వేషించండి

Tesla Hyderabad Showroom: గ్లోబల్ సిటీలో గ్లోబల్ కార్: హైదరాబాద్‌కు టెస్లా రాక ఖరారు!

Tesla Hyderabad Showroom:హైదరాబాద్‌లో టెస్లా షోరూమ్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కంపెనీ ప్రతినిధులు సమావేశమైన చర్చించారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టెస్లా ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు.
  • హైదరాబాద్‌లో సేల్స్, సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించాలనే ఆకాంక్ష.
  • హైదరాబాద్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు టెస్లాకు అనుకూలం.
  • టెస్లా రాకతో ఉద్యోగాల కల్పన, ఈవీ మార్కెట్ వృద్ధి.

Tesla Hyderabad Showroom:ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న టెస్లా తన అడుగులను హైదరాబాద్ వైపు వేగంగా వేస్తోంది. మే 22 శుక్రవారం నాడు టెస్లా ఇండియా ప్రతినిధులు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. ఈ భేటీలో హైదరాబాద్ వేదికగా టెస్లా తన సేల్స్, సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించాలనే బలమైన ఆకాంక్షను వ్యక్తం చేసింది. 

హైదరాబాద్ నగరాన్ని తన తదుపరి విస్తరణ గమ్యస్థానంగా టెస్లా ఎంచుకుంది. ఈ సమావేశంలో టెస్లా ప్రతినిధులు నగరంలో అత్యాధునిక షోరూమ్‌, సేల్స్‌ సెంటర్, సర్వీస్ మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రితో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యల ప్రకారం, తెలంగాణలో ఉన్న టెక్నాలజీ ఎకో సిస్టమ్‌ టెస్లా దీర్ఘకాలిక ఆవిష్కరణ లక్ష్యాలకు సరిగా సరిపోతుంది. హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కలిగి ఉంది. ఐటీ  రంగంలో హైదరాబాద్ ఎదుగుదల, టెస్లా వంటి టెక్ డ్రివెన్ కార్లకు సరైన మార్కెట్‌ను అందిస్తుంది. పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారం కంపెనీని ఆకర్షించింది. 

Image

ప్రారంభం ఎప్పుడు 

అధికారికంగా తేదీలు ప్రకటించనప్పటికీ ఈ సమావేశం ప్రాథమిక చర్చల దశను దాటి అమలు దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వం, టెస్లా ప్రతినిధుల మధ్య సమన్వయం వేగవంతం కావడంతో అతి త్వరలోనే షోరూమ్ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

టెస్లా రాకతో కలిగే ప్రయోజనం ఏంటీ

టెస్లా రాక కేవలం ఒక కారు షోరూమ్ ప్రారంభానికి పరిమితం కాదు. టెస్లా తన అనుబంధ పరిశ్రమలను కూడా తెలంగాణలో విస్తరించేలా చూడాలని మంత్రి శ్రీధర్ బాబు కంపెనీని కోరారు. దీని వల్ల స్థానికంగా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం భారత్‌ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాట కేవలం నాలుగు శాతం మాత్రమే. టెస్లా వంటి బ్రాండ్ ప్రవేశంతో ఈ మార్కెట్ ఊహించని రీతిలో వృద్ధి చెందుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఈవీ రంగంలో దూసుకుపోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఏకంగా 91వేల ఈవీ రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి. 

మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చిన హామీలు, టెస్లా ప్రతినిధుల ఆసక్తి చూస్తుంటే హైదరాబాద్ వీధుల్లో టెస్లా కార్ల హంగామా మొదలయ్యే రోజు దగ్గరలోనే ఉందని అర్థమవుతుంది. 

Frequently Asked Questions

టెస్లా హైదరాబాద్‌లో ఏ కేంద్రాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది?

టెస్లా హైదరాబాద్‌లో తమ సేల్స్, సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. దీనిలో అత్యాధునిక షోరూమ్, సర్వీస్ మౌలిక సదుపాయాలు ఉంటాయి.

తెలంగాణ ప్రభుత్వం టెస్లాకు ఎలాంటి మద్దతు అందిస్తోంది?

తెలంగాణ ప్రభుత్వం టెస్లాకు పూర్తి స్థాయి మద్దతు అందిస్తుంది. హైదరాబాద్‌లోని టెక్నాలజీ ఎకోసిస్టమ్, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కంపెనీకి అనుకూలంగా ఉంటాయని మంత్రి తెలిపారు.

హైదరాబాద్‌లో టెస్లా రాక వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

టెస్లా రాకతో స్థానికంగా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వృద్ధి చెందుతుంది.

టెస్లా షోరూమ్ ఎప్పుడు ప్రారంభం కావచ్చు?

అధికారికంగా తేదీలు ప్రకటించనప్పటికీ, ప్రభుత్వం, టెస్లా ప్రతినిధుల మధ్య సమన్వయం వేగవంతం కావడంతో అతి త్వరలోనే షోరూమ్ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Breaking News: 10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget