అన్వేషించండి

Tesla Cars: భారత్‌లో టెస్లా కార్లపై ధర తగ్గింపు, ఏ మోడల్స్ చౌకగా మారాయి? అధిక ధరలే కారణమా

భారత్ లో టెస్లా కొన్ని కార్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. కొనుగోళ్లు లేకపోవడంతో కొన్ని మోడల్స్ ధరలు తగ్గించారు. ఏ మోడల్స్ పై తగ్గింపు, కస్టమర్లకు లాభాలేమిటో చూడండి.

భారతదేశంలోకి లగ్జరీ కార్ల లాంచింగ్ ఈజీ. అదే విధంగా టెస్లా కూడా భారత మార్కెట్లోకి వచ్చింది. టెస్లా భారతదేశంలో ఒకే ఒక మోడల్, మోడల్ Y ని మాత్రమే దిగుమతి చేసుకుని విక్రయిస్తుంది. ఇది పూర్తిగా దిగుమతి చేసుకున్న కారు కనుక, భారీ కస్టమ్స్ సుంకాలను విధిస్తుంది. దీని ధర భారీగా పెరుగుతుంది. అందుకే చాలా మంది భారత కస్టమర్లు BYD, BMW వంటి బ్రాండ్‌లకు మారారు.

ఏ టెస్లా మోడళ్లకు డిస్కౌంట్లు ఇచ్చారు
టెస్లా ఇప్పుడు కొన్ని అంతగా అమ్ముడుపోని 2025 మోడల్ Y యూనిట్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డిస్కౌంట్ స్టాండర్డ్ సిరీస్ వేరియంట్‌పై అందిస్తున్నారు. దీని ధర ₹60 లక్షల లోపు ఉంది. అయితే, ఈ ఆఫర్ అన్ని టెస్లా కార్లకు వర్తించదు, కానీ జాబితాలో అమ్ముడుపోని వాహనాలకు డిస్కౌంట్ అందించి సేల్స్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది.

ఆందోళన పెంచుతున్న అమ్మకాల లెక్కలు 
డిసెంబర్‌లో టెస్లా భారతదేశంలో 68 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇది BYD, BMW వంటి పోటీదారుల కంటే చాలా తక్కువ. 2025 క్యాలెండర్ సంవత్సరంలో టెస్లా మొత్తం అమ్మకాలు 200 యూనిట్లకు పైగా ఉన్నాయి. అయితే టెస్లా కంపెనీ చాలా మెరుగైన పనితీరును ఆశించింది. ప్రారంభంలో టెస్లా మంచి బుకింగ్‌లను అందుకుంది. కానీ అధిక ధరలకు చాలా మంది కస్టమర్లు తమ బుకింగ్‌లను రద్దు చేసుకున్నారు.

ఖరీదైన ధర, పరిమిత షోరూమ్ నెట్‌వర్క్
టెస్లా మోడల్ Y భారతదేశంలో BMW iX1 LWB, బీవైడీ (BYD) సీలియన్ 7 వంటి ఎలక్ట్రిక్ SUVల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటుంది. సమస్య ఏమిటంటే పోటీ కంపెనీల కార్లు తక్కువ ధరలకు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా, టెస్లా సర్వీస్ సెంటర్లు, షోరూమ్‌ల సంఖ్య ప్రస్తుతం పరిమితంగా ఉంది. అయినప్పటికీ కంపెనీ క్రమంగా దాని నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ఇది భవిష్యత్తులో అమ్మకాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. టెస్లా మోడల్ Yని నడిపిన తర్వాత, చాలా మంది దాని పనితీరు, టెక్నాలజీ, డ్రైవ్ నాణ్యతతో ఆకట్టుకుంది. అయితే, దీని ధర భారత మార్కెట్‌కు చాలా ఎక్కువ అని భావిస్తున్నారు. ప్రత్యేకించి అదే విభాగంలో మరింత సరసమైన వేరియంట్ ఎంపికలు అందుబాటులో ఉన్నప్పుడు టెస్లా విక్రయాలు తగ్గాయి.

టెస్లా వ్యూహాన్ని ఏది ముందుకు తీసుకెళ్తుంది

ఇప్పుడు లంబోర్గిని ఇండియా మాజీ CEO శరద్ అగర్వాల్ టెస్లా ఇండియా కార్యకలాపాలు చూస్తున్నారు. టెస్లా కంపెనీ వ్యూహాత్మక మార్పులు చేస్తుందని అంతా భావిస్తున్నారు. భారత మార్కెట్లో విజయం సాధించడానికి, టెస్లా కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడంతో పాటు, స్థానికంగా అసెంబ్లింగ్ చేయడం లేదా ధరల తగ్గింపు వంటి మార్గాల ద్వారా టెస్లా కార్ల ధరలు దిగి రావొచ్చు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hybrid SUV: 1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
Car Coolant: కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
Top Car Exports From India 2026: భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా? 
భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా?
Alloy Wheel or Steel Wheel: అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!
అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget