Bandi Sanjay On CM KCR : ఉద్యోగులకు జీతాలియ్యడం చేతకాని కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఏదో చేస్తాడంట - బండి సంజయ్
Bandi Sanjay On CM KCR : బీజేపీని హేళన చేసిన పార్టీలన్నీ తెరమరుగయ్యాయని బండి సంజయ్ అన్నారు. తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు.
Bandi Sanjay On CM KCR : ధనిక రాష్ట్రమైన తెలంగాణను రూ.4 లక్షల కోట్లు అప్పులు చేసి అప్పుల రాష్ట్రంగా మార్చారని, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. కుకట్ పల్లిలో మాట్లాడిన ఆయన... కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. పోలీసులకు, లాఠీలకు, జైళ్లకు భయపడే ప్రసక్తేలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఎనిమిదేళ్లలో ఎంతో పురోగతి సాధించిందన్నారు. ఎన్నో ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం అధోగతి పాలయ్యిందన్నారు. బీజేపీని హేళన చేసిన అన్ని పార్టీలు తెరమరుగయ్యాయన్నారు. ఆర్టికల్ 370ను రద్దుచేసిన ఘనత నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ పార్టీదే అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేపట్టిన ఘనత బీజేపీదే అని బండి సంజయ్ అన్నారు.
ఆర్టీసీ ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర
Live: #8YearsOfSeva Sushasan and Garib Kalyan, a Sammelan on the occasion of Modi Govts 8 years of Seva. #8YearsOfModiGovernment https://t.co/2em97bGaGd
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 10, 2022
ప్రజాస్వామ్యయుతంగా ఆర్టీసీ ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడానికి కూడా వెళ్లనివ్వరా..?
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 10, 2022
ఆర్టీసీ చార్జీలు పెంచడం మూర్ఖత్వం కాదా..?
టీఆర్ఎస్ సర్కారు మూడేళ్లలో ఐదుసార్లు చార్జీలు పెంచింది. పేదలను బస్సుల్లో కూడా తిరగనివ్వరా..? నడుచుకుంటూ తిరగాలా..? pic.twitter.com/IYBVHaRRXa