అన్వేషించండి

MMTS Trains: కొత్తగా మరో 4 ఎంఎంటీఎస్ రైళ్లు, మేడ్చల్-లింగంపల్లి, మేడ్చల్-హైదరాబాద్ మధ్య సేవలు

MMTS Trains: హైదరాబాద్, సికింద్రాబాద్ సబర్బన్‌కు సంబంధించి 4 ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది.

MMTS Trains: కొత్తగా మరో 4 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెడుతూ దక్షిణ మధ్య రైల్వే జోన్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ సబర్బన్ లో ఈ కొత్త ఎంఎంటీఎస్ లు సేవలు అందించనున్నాయి. ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను మేడ్చల్-లింగంపల్లి, మేడ్చల్- హైదరాబాద్ స్టేషన్ల మధ్య కొత్తగా నాలుగు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ నెల 1 నుంచే ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తూ శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ నిర్ణయం తీసుకుంది. 

సికింద్రాబాద్, కాచిగూడ నుంచి నడుస్తున్న మూడు వందే భారత్ రైళ్లను అందుకునేందుకు వీలుగా ఉండే ఉండే విధంగా ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రకటించింది. అందుకు సంబంధించిన నూతన టైమ్ టేబుల్ ను కూడా విడుదల చేసింది. అందుకోసం సికింద్రాబాద్ - ఉమ్‌దానగర్, ఫలక్‌నుమా - సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య కూడా ఎంఎంటీఎస్ సర్వీసులను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

రోజూ మేడ్చల్ లో ఉదయం 7.20 గంటలకు, మధ్యాహ్నం 3.30 గంటలకు ఎంఎంటీఎస్ సేవలు ఉంటాయి. అలాగే, లింగంపల్లి నుంచి ఉదయం 10.20 గంటలకు, సాయంత్రం 6.10 గంటలలకు ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఆదివారం సర్వీసులు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే, మేడ్చల్ - హైదరాబాద్ కు సంబంధించిన సర్వీసు ఉదయం 11.50 గంటలకు మేడ్చల్ లో బయల్దేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 1.40 గంటలకు హైదరాబాద్ లో స్టేషన్ నుంచి బయల్దేరుతుంది.

కొత్త ఎంఎంటీఎస్ సేవలు విద్యార్థులు, ప్రయాణికులు, చిన్న వ్యాపారులు, మహిళలు, ఉద్యోగులు మొదలైన వారికి ప్రయోజనకరంగా ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. కొత్త టైమ్ టేబుల్ కార్యాలయాలకు వెళ్లే వారి ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రూపొందించినట్లు చెప్పారు.

ప్రత్యేక వందేభారత్ రైళ్లు
అక్టోబరు 14న అహ్మదాబాద్‌లోని జరిగే దాయాది దేశాల మధ్య పోరుకు భారీగా అభిమానులు తరలిరానుండడంతో క్రికెట్‌ అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. భారత్‌-పాక్‌ మ్యాచ్ జరిగే రోజున మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు నడపనున్నట్లు వెల్లడించింది. ఈ రైళ్లు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. త్వరలోనే రైళ్ల షెడ్యూల్‌, టికెట్ ధరల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. 
 
మ్యాచ్‌ ప్రారంభం కావడానికి కొన్నిగంటల ముందు ఈ ప్రత్యేక రైళ్లు సబర్మతీ, అహ్మదాబాద్ స్టేషన్లకు చేరుకుంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రెండు స్టేషన్లు నరేంద్ర మోదీ స్టేడియానికి దగ్గరగా ఉండటంతో అభిమానులు సులభంగా స్టేడియానికి చేరుకోవచ్చన్నారు. అదేవిధంగా మ్యాచ్‌ ముగిసిన కొద్ది గంటల తర్వాత ఈ రైళ్లు అహ్మదాబాద్‌ నుంచి తిరిగి బయల్దేరుతాయని, దాని వల్ల అభిమానులు అదే రోజు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకోవచ్చని తెలిపారు.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS MLAs Walk Out: అసెంబ్లీలో మూసీపై మాటల యుద్ధం.. సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్
BRS MLAs Walk Out: అసెంబ్లీలో మూసీపై మాటల యుద్ధం.. సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్
CM Revanth Musi Revival Project: అగ్నిపరీక్షగా మూసి ప్రక్షాళన - మాటలకే ఇంత కాలం మరి చేతలెప్పుడు?
అగ్నిపరీక్షగా మూసి ప్రక్షాళన - మాటలకే ఇంత కాలం మరి చేతలెప్పుడు?
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Drug Test in Telangana Assembly: డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Karnataka Rains: కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
Pithapuram Varma: పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
Fatty Liver : కాలేయ ఆరోగ్యం కోసం రోజూ 5 టిప్స్ ఫాలో అవ్వండి.. ఫ్యాటీ లివర్​ పూర్తిగా దూరమవుతుంది
కాలేయ ఆరోగ్యం కోసం రోజూ 5 టిప్స్ ఫాలో అవ్వండి.. ఫ్యాటీ లివర్​ పూర్తిగా దూరమవుతుంది
YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
Kerala Assembly Elections 2026:కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
Embed widget