Hyderabad Hospital: రోగి చనిపోయాడని తేల్చిన కార్పొరేట్ ఆస్పత్రి, అంత్యక్రియలకు బంధువుల ఏర్పాట్లు.. తీరా చూసి అంతా అవాక్కు
సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది ప్రాణాలతోనే ఉన్న రోగి చనిపోయాడని చెప్పడంతో రోగి కుటుంబ సభ్యులు రోదిస్తూ వారి బంధువులకు మృతిచెందాడని సమాచారం ఇచ్చారు.
హైదరాబాద్‌లో మరో కార్పొరేట్ ఆస్పత్రి చేసిన నిర్వాకం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పటిదాకా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఇప్పుడు పెద్ద ప్రైవేటు ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల బతికున్న రోగి చనిపోయారని చెప్పడంతో బంధువులు ఆందోళనకు దిగారు. డబ్బు కోసమే వారు ఇలా చేశారంటూ బంధువు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట నిరసన చేపట్టారు.
వివరాలివీ..
హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాణాలతోనే ఉన్న రోగి చనిపోయాడని సిబ్బంది చెప్పారు. దీంతో రోగి కుటుంబ సభ్యులు రోదిస్తూ వారి బంధువులకు ఈ సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత రోగి శ్వాస తీసుకోవడం గమనించి పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పల్స్ చెక్ చేయగా 95 చూపించింది. దీంతో వారు నిర్ఘాంతపోయి ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సనత్ నగర్‌కు చెందిన మహేందర్ అనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇతడిని మొదట ఈసీఐఎల్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు అడ్మిట్ చేసుకోలేదు. దీంతో వారు అక్కడ నుంచి సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చి గత మూడు రోజుల క్రితం చేర్పించారు.
Also Read: Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర.. ఏకంగా రూ.300, వెండి కూడా అదే దారిలో.. తాజాగా ఇలా..
అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి రోగికి చికిత్స అందిస్తున్నారు. ఆ చికిత్స కోసం వారు అప్పటికే రూ.3.5 లక్షలను చెల్లించారు. శనివారం మధ్యాహ్నం మహేందర్ చనిపోయాడని చెప్పి వెంటిలేటర్ తొలగించి ఆస్పత్రి సిబ్బంది రోగిని బయటకు తీసుకువచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు కూడా రోధిస్తూ వారి బంధువులకు, తెలిసినవారికి సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా మహేందర్ శ్వాస తీసుకోవడాన్ని కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పల్స్ చూడగా బతికే ఉన్నాడని తెలిసింది.
దీంతో కుటుంబ సభ్యులు బతికున్న రోగి ఎలా చనిపోయాడని ఆస్పత్రి సిబ్బంది చెప్తారని.. వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. ఆస్పత్రి లైసెన్స్, ఇతర అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని సముదాయించారు. చివరికి ఆస్పత్రి సిబ్బంది మహేందర్‌ను తిరిగి చికిత్స కోసం లోనికి తీసుకువెళ్లారు.
Also Read: Moosapet: వేర్వేరుగదుల్లో నిద్రపోయిన భార్యాభర్తలు.. ఉదయం లేచి చూస్తే షాక్!
Also Read: TS Academic Calendar: తెలంగాణలో 2021-22 విద్యా సంవత్సరం ఖరారు.. దసరా, సంక్రాంతి సెలవులు ఎప్పుడంటే..?