అన్వేషించండి

TS Academic Calendar: తెలంగాణలో 2021-22 విద్యా సంవత్సరం ఖరారు.. దసరా, సంక్రాంతి సెలవులు ఎప్పుడంటే..?

తెలంగాణలో 2021-22  విద్యా సంవత్సరాన్ని ఖరారు చేస్తూ.. రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 213 పనిదినాలు ఉంటాయని తెలిపింది.

తెలంగాణలో 2021-22  విద్యా సంవత్సరాన్ని ఖరారు చేస్తూ.. రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 213 పనిదినాలు ఉంటాయని తెలిపింది. తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1కి ముందు నిర్వహించిన 47 రోజుల ఆన్‌లైన్‌ తరగతులను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఇక దసరా సెలవులు అక్టోబర్‌ 6 నుంచి 17 వరకు ఉంటాయని వెల్లడించింది.

మిషనరీ పాఠశాలల్లో చదివే వారికి క్రిస్మస్‌ సెలవులు డిసెంబర్‌ 22 నుంచి 28 వరకు ఉంటాయని తెలిపింది. సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 16 వరకు ఉంటాయి. వేసవి సెలవులను ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 12 వరకు ఇవ్వనున్నట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, కోవిడ్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నర కాలంగా దేశంలో పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గడంతో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. 

ఏపీ అకడమిక్ క్యాలెండర్‌లో కీలక మార్పులు
కోవిడ్ కారణంగా ఆంధ్రప్రదేశ్ నూతన విద్యాసంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక మార్పులను చేసింది. 2021-22 ఏడాది సిలబస్ తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. 3 నుంచి 9 తరగతుల వారి సిలబస్ 15 శాతం తగ్గనుంది. ఇక 10వ తరగతి విద్యార్థులకు 20 శాతం సిలబస్ తగ్గుతుంది. కోవిడ్ కారణంగా చాలా రోజులు తరగతులు జరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాల పని దినాలకు సంబంధించిన అకడమిక్ కేలండర్‌ కూడా తగ్గించింది. దీనికి 31 వారాల నుంచి 27 వారాలకు కుదించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈసారి రెండు భాగాలుగా అకడమిక్ కేలండర్​ రూపొందించినట్లు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు తెలిపారు. ఏపీలో ఆగస్ట్ 16 నుంచి పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. స్కూళ్లలో కోవిడ్‌ నిబంధనలను పాటించడంతో పాటు విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. 

Also Read: Tokyo Paralympics: బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో రెండు పతకాలు... పసిడి ముద్దాడిన ప్రమోద్ భగత్... కాంస్యంతో మనోజ్ సర్కార్

Also Read: JSP For AP Roads : ఏపీ రోడ్ల బండారాన్ని బయట పెట్టిన జనసేన.. లక్షల్లో సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు ..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget