Tokyo Paralympics: బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో రెండు పతకాలు... పసిడి ముద్దాడిన ప్రమోద్ భగత్... కాంస్యంతో మనోజ్ సర్కార్
టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ మరో రెండు పతకాలను తన ఖాతాలో వేసుకుంది.
టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ మరో రెండు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో ఒకటి స్వర్ణం కాగా... మరొకటి కాంస్యం. బ్యాడ్మింటన్ పురుషుల SL3 విభాగంలో భారత పారా అథ్లెట్ ప్రమోద్ భగత్ ఫైనల్లో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. ఇదే విభాగంలో మరో అథ్లెట్ మనోజ్ సర్కార్ కాంస్య పతకం గెలిచాడు.
The #GoldRush continues for #IND at #Tokyo2020 #Paralympics!✨@PramodBhagat83 staying true to his World no.1 status wins #Gold 🥇in Men's Singles SL3 #Badminton!#Praise4Para#indiaatparalympics #Cheer4India #UnitedByEmotion #StrongerTogether #Parabadminton #ParalympicsTokyo2020 pic.twitter.com/GvVnBa6SOW
— Paralympic India 🇮🇳 #Cheer4India 🏅 #Praise4Para (@ParalympicIndia) September 4, 2021
ఫైనల్లో ప్రమోద్... గ్రేట్ బ్రిటన్‌కి చెందిన బెతల్ డానియల్ పై రెండు వరుస సెట్లలో విజయం సాధించాడు. పారాలింపిక్స్‌లో SL3 పురుషుల విభాగంలో భారత్ స్వర్ణం సాధించడం ఇదే మొదటిసారి.
శుభాకాంక్షల వెల్లువ
పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ప్రమోద్ భగత్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమోద్ భగత్ ఒడిశాకు చెందిన ఆటగాడు. ఈ సందర్భంగా ఒడిశా క్రీడా ప్రభుత్వం ప్రమోద్‌కు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ, మేరీ కోమ్, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు ప్రమోద్‌కు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు.
Pramod Bhagat has won the hearts of the entire nation. He is a Champion, whose success will motivate millions. He showed remarkable resilience & determination. Congratulations to him for winning the Gold in Badminton. Best wishes to him for his future endeavours. @PramodBhagat83
— Narendra Modi (@narendramodi) September 4, 2021
@manojsarkar07 wins #Bronze 🥉at #Tokyo2020 #Paralympics #Badminton Men's Singles SL3! Double Podium Finish has become #India's thing at #TokyoParalympics!🤩✨🤩 #Praise4Para #Parabadminton #UnitedByEmotion #StrongerTogether
— Paralympic India 🇮🇳 #Cheer4India 🏅 #Praise4Para (@ParalympicIndia) September 4, 2021
Medal no.1️⃣7️⃣ for India at #ParalympicsTokyo2020 🎉🏸 pic.twitter.com/PKkdBMQo2z
Heartiest congratulations to @PramodBhagat83 & @manojsarkar07 on the Gold & Bronze medal win! Our #Tokyo2020 tally is at 4 Gold, 7 Silver,6 Bronze now!🇮🇳 #Praise4Para @narendramodi @ianuragthakur @NisithPramanik @Paralympics @PTI_News @ParalympicIndia @GauravParaCoach @Media_SAI pic.twitter.com/b1llach40a
— Deepa Malik (@DeepaAthlete) September 4, 2021
పారా ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 17 పతకాలు సాధించింది. ఇందులో నాలుగు స్వర్ణ, ఏడు రజత, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి.