News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర.. ఏకంగా రూ.300, వెండి కూడా అదే దారిలో.. తాజాగా ఇలా..

హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం ధర గ్రాముకు రూ.30 పెరిగింది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.48,550 గా ఉంది.

FOLLOW US: 
Share:

భారత్‌లో బంగారం, వెండి ధరలు ఈ రోజు (సెప్టెంబరు 4) పెరిగాయి. బంగారం ధర గ్రాముకు రూ.20 వరకూ పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ భారత మార్కెట్‌లో రూ.46,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.47,400 గా ఉంది. మొత్తానికి గత 10 రోజుల ధరలతో పోలిస్తే పసిడి కాస్త ధర పెరిగింది.

భారత మార్కెట్‌లో బంగారం ధర పెరగ్గా.. వెండి కూడా అదే దారిలో పయనించింది. గ్రామునకు రూ.1.60 మేర పెరిగింది. కానీ, హైదరాబాద్ మార్కెట్‌లో మాత్రం వెండి ధర గ్రాముకు రూ.1.80 ఎగబాకింది. తాజాగా భారత మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.65,200గా కొనసాగుతోంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర కాస్త ఎక్కువగా రూ.69,600 ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో సెప్టెంబరు 4న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం ధర గ్రాముకు రూ.30 పెరిగింది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.48,550 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6) ధర రూ.44,500 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.69,600 పలికింది.

ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర సెప్టెంబరు 4న రూ.44,500 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,550గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.69,600గా ఉంది. విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,500 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,550గా ఉంది. ఇక్కడ కూడా వెండి ధర కిలోకు హైదరాబాద్ తరహాలోనే రూ.69,600 పలుకుతోంది.

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు సెప్టెంబరు 4న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,400 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,400గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,960 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,050గా ఉంది.

ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర హైదరాబాద్‌లో గ్రాము రూ.2,397గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఈ ధర గ్రాముకు రూ.53 వరకూ పెరిగింది. 10 గ్రాముల ప్లాటినం ధర ఇక్కడ రూ.23,970 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అదే కొనసాగుతోంది.

వివిధ అంశాలపై పసిడి ధర
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.

Published at : 05 Sep 2021 06:52 AM (IST) Tags: Gold Price Silver Price Todays gold cost Todays silver price platinum price hyderabad gold silver price vijayawada gold price

ఇవి కూడా చూడండి

Cryptocurrency Prices Today: రూ.55వేలు నష్టపోయిన బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices Today: రూ.55వేలు నష్టపోయిన బిట్‌కాయిన్‌

Stock Market Today: హమ్మయ్య! 4 రోజుల నష్టాలకు చెక్‌ - సెన్సెక్స్‌, నిఫ్టీ అప్‌!

Stock Market Today: హమ్మయ్య! 4 రోజుల నష్టాలకు చెక్‌ - సెన్సెక్స్‌, నిఫ్టీ అప్‌!

Savings at Risk: తగ్గిన కుటుంబ ఆదా! బ్యాంకుల 'స్ట్రాటజీ'తో పెరిగిన అప్పులు!

Savings at Risk: తగ్గిన కుటుంబ ఆదా! బ్యాంకుల 'స్ట్రాటజీ'తో పెరిగిన అప్పులు!

SBI Bonds: రూ.10,000 కోట్లు సమీకరించిన ఎస్బీఐ - షేర్ల మూమెంటమ్‌ ఎలా ఉందంటే?

SBI Bonds: రూ.10,000 కోట్లు సమీకరించిన ఎస్బీఐ - షేర్ల మూమెంటమ్‌ ఎలా ఉందంటే?

Stock Market Today: ఇంట్రాడే కనిష్ఠాల్లో సూచీలు! 19,600 సపోర్ట్‌ వద్ద నిఫ్టీ ఊగిసలాట

Stock Market Today: ఇంట్రాడే కనిష్ఠాల్లో సూచీలు! 19,600 సపోర్ట్‌ వద్ద నిఫ్టీ ఊగిసలాట

టాప్ స్టోరీస్

Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?

Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత