అన్వేషించండి

Rain In Hyderabad: హైదరాబాద్ లో జోరువాన.. ఆకాశానికి చిల్లు పడిందా ఏంటీ?

హైదరాబాద్ లో వాన జోరుగా కురుస్తోంది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. న‌గ‌రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 

ఉపరితల ఆవర్తనం కారణంగా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది.  మరోవైపు నాలాలు పొంగిపొర్లాయి. పనుల కోసం బయటకొచ్చిన ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  కూకట్‌పల్లి, నిజాంపేట్, ప్రగతినగర్‌, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, మాదాపూర్‌, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, చంపాపేట్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, చాంద్రాయణగుట్ట, బార్కస్‌, ఉప్పుగూడ, జహనుమా, షా అలీ బండ, బహదూర్‌పురా, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, సూరారం, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, విద్యానగర్, అడిక్‌మెట్, గాంధీ నగర్, బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, ఈఎస్ఐ, అమీర్‌పేట, ఎస్‌.ఆర్‌.నగర్‌, మైత్రీవనం, వెంగళ్​రావు నగర్​, ఉప్పల్, బోడుప్పల్, రామంతాపూర్, పీర్జాదిగూడ, షేక్‌పేట, ఆదిత్యనగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

Also Read: Amazon Jobs: అమెజాన్‌ జాబ్ మేళా.. 8 వేల ఉద్యోగాలు భర్తీ.. హైదరాబాద్‌లో కూడా..

లక్డీకపూల్‌, నాంపల్లి, పంజాగుట్ట, యూసుఫ్​గూడ, శ్రీనగర్‌, మియాపూర్, చందానగర్, బాలానగర్, చింతల్, వనస్థలిపురం, ఉప్పల్, నిజాంపేట్, శ్రీ కృష్ణనగర్​, సుల్తాన్​బజార్, కోఠి, పురాణాపూల్​, జియాగూడా, షేక్​పేట, పహీడీషరీఫ్, జల్​పల్లి, రాజేంద్రనగర్​, మాదాపూర్‌, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోనూ వాన దంచికొట్టింది. 

Also Read: Sharmila Alone : షర్మిల ఒంటరినని ఎందుకన్నారు.. పక్కనే ఉన్నా పలకరించుకోలేదు ఎందుకు..?

ఒక్కసారిగా కురిసిన జోరు వానతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది.  పంజాగుట్ట వద్ద వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్ల మీద నుంచి నీరు పోతుండటంతో.. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.  మాదాపూర్-కొండాపూర్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Also Read: Huzurabad News: టీఆర్ఎస్ గెలిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటా.. నువ్వు ఆ పని చేస్తవా కేసీఆర్? ఈటల సంచలనం

సాయంత్రం నుంచే వర్ష పడటంతో అక్కడకక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆఫీసుల నుంచి ఇంటికెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షంపై జీహెచ్ఎంసీ అలెర్టయ్యింది. గ్రౌండ్ లెవెల్ లో పని చేస్తున్న సిబ్బంది, అధికారులు అలెర్ట్ గా ఉండాలని అధికారులు ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పాతబస్తీ బహదూర్‌పురా వద్ద రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మాదాపుర్ శిల్పారామం సమీపంలో ప్రధాన రహదారిపై భారీగా చేరిన వరద నీరడంతో పాటు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి.

Also Read: YS Sharmila: నాన్నా.. ఒంటరిదాన్నయ్యా, కన్నీరు ఆగనంటుంది.. వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget