(Source: ECI/ABP News/ABP Majha)
GHMC: కరాచీ బేకరీకి జరిమానా.. ఓ నెటిజన్ ఫిర్యాదుతో చర్యలు, ఏం జరిగిందంటే..
కరాచీ బేకరీ నుంచి కొన్న మిఠాయిలకు బూజు పట్టి ఉండడంతో సంబంధిత ఫోటోలు తీసి నెటిజన్ బిల్లులతో సహా ట్వీట్ చేశాడు.
బేకరీ రంగంలో దిగ్గజం అయిన కరాచీ బేకరీపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అందులో కొన్న ఆహార పదార్థాలపై ఓ నెటిజన్ ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేయడంతో ఆహార భద్రత అధికారులు కరాచీ బేకరీపై కొరడా ఝళిపించారు. తాను కరాచీ బేకరీ నుంచి కొన్న మిఠాయిలకు బూజు పట్టి ఉండడంతో సంబంధిత ఫోటోలు తీసి నెటిజన్ బిల్లులతో సహా ట్వీట్ చేశాడు. ఈ ఫిర్యాదుతో కదిలిన జీహెచ్ఎంసీ అధికారులు.. కరాచీ బేకరీపై కేసు నమోదు చేసి జరిమానా విధించారు.
Also Read: Wife Missing: భార్య కోసం ఇద్దరు భర్తల వెతుకులాట గుర్తుందా? తాజాగా కీలక ట్విస్ట్.. ఆ ఒక్కటీ అడగొద్దట!
కరాచీ బేకరీలో తాను కొన్న మిఠాయిలపై బూజు ఉందంటూ ఓ నెటిజన్ రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌కు ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆయన.. వెంటనే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. బేకరీలో కొనుగోలు చేసిన మిఠాయిపై ఫంగస్ పెరుగుతోందని ఓ పౌరుడి ఫిర్యాదుతో చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. దీంతో ఖాజాగూడలోని కరాచీ బేకరీలో సోదాలు నిర్వహించిన అనంతరం అధికారులు సదరు ఫిర్యాదుపై జరిమానా విధించారు.
Also Read: Crime News: ఖమ్మంలో స్నేహితుడి దారుణం.. కత్తితో విచక్షణారహితంగా దాడి, కారణం తెలిస్తే షాక్..!
ఆ పరిధికి సంబంధించిన సర్కిల్ అసిస్టెంట్ వైద్యాధికారి కే ఎస్ రవి, ఆహార కల్తీ నియంత్రణ అధికారి సూర్య వెంటనే బేకరీకి వెళ్లి తనిఖీలు చేశారు. బేకరి పరిసరాలు, వంట గదిని పరిశీలించారు. పరిశుభ్రత లేకపోవడం, వ్యర్థాల కలబోత, ప్లాస్టిక్ వినియోగం, మురుగు నీటి వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, కరోనా నిబంధనలను పాటించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో అక్కడికక్కడే అధికారులు రూ.10 వేల జరిమానా విధించారు. మిఠాయిలు, ఇతర ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించామని, వాటి ఫలితాలు వచ్చాక సంబంధిత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పారు.
Also Read: "హ్యాపీ న్యూ ఇయర్" చెప్పుకున్నంత ఈజీ కాదు.. చాలా భారమే ! మీపై ఎంత భారం పడబోతోందో చూడండి.. !
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.