అన్వేషించండి

GHMC MeeSeva WhatsApp Number: అరచేతిలోనే జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌! వాట్సాప్‌లోనే బర్త్‌ సర్టిఫికెట్‌ నుంచి 9 రకాల సేవలు!

GHMC MeeSeva WhatsApp Number:హైదరాబాద్‌ వాసులకు శుభవార్త! జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆస్తి పన్ను, జనన మరణ ధృవీకరణ పత్రాల సవరణ వంటి 9 కీలక సేవలు వాట్సాప్‌లో పొందవచ్చు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మీసేవ వాట్సాప్ ద్వారా జీహెచ్ఎంసీ తొమ్మిది కొత్త సేవలు అందుబాటులోకి.
  • ఇంటి నుండే ఆస్తి పన్ను, జనన, మరణ నమోదు సేవలు పొందవచ్చు.
  • ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ, ఖర్చు తగ్గుతుంది.
  • 8096958096 నంబర్ కు మెసేజ్ చేసి సేవలు పొందవచ్చు.

GHMC MeeSeva WhatsApp Number:హైదరాబాద్‌లో బర్త్ సర్టిఫికెట్ సవరణ కోసమో లేదా ప్రాపర్టీ ట్యాక్స్‌ చెల్లింపు కోసమో ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగడం అంటే అగ్నిపరీక్షే. కానీ, మారుతున్న కాలంతోపాటు  పాలన కూడా ప్రజల అరచేతిలోకి వచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఐటీ, కమ్యూనికేషన్ల విభాగం ఆధ్వర్యంలోని మీ సేవ ప్లాట్‌ఫామ్, గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజల కోసం విప్లవాత్మక మార్పులు చేపట్టింది. 

తెలంగాణ మీ సేవ ప్లాట్‌ఫామ్ తన వాట్సాప్ చాట్‌బాట్‌ సేవలను మరింత విస్తరించింది. గతంలో ఉన్న సేవల కంటే అదనంగా, ఇప్పుడు తొమ్మిది కొత్త జీహెచ్ఎంసీ సేవలను ఈ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో చేర్చారు. దీని వల్ల హైదరాబాద్‌ నివాసితులు తమ ఇంటి నుంచే కేవలం ఒక వాట్సాప్‌ మెసేజ్‌తో తమ పనులను పూర్తి చేసుకోవచ్చు. కార్యాలయాలకు వెళ్లి గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండానే, నేరుగా చాట్‌ ఇంటర్‌ఫేస్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. 

కొత్తగా అందుబాటులోకి వచ్చిన 9 సేవలు 

ఆస్తి పన్ను సేవలు, పన్ను చెల్లింపులు, విచారణలు అందుబాటులోకి వచ్చాయి. వ్యాపారస్తులు సులభంగా తమ లైసెన్స్‌లను అప్‌డేట్‌్ చేసుకోవచ్చు. పేర్లు లేదా ఇతర వివరాలు జనన ధృవీకరణ పత్రాల్లో సవరణలు ఉంటే సరిదిద్దుకోవచ్చు. ప్రాపర్టీ డోర్ నంబర్‌ సవరణ చేసుకోవచ్చు.  పేరు మార్పు, సవరణ, ఇంటి వద్ద జరిగిన జననాల నమోదు, ఇంటి వద్ద జరిగిన మరణాల నమోదు, ఇతర పౌర సేవలు ఇందులో పొందవచ్చు. 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పౌర సేవలను డిజిటలైజ్‌ చేయాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టింది. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్, వాట్సాప్‌ అందుబాటులో ఉన్నాయి. ఇతర యాప్‌లు డోన్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా పని పూర్తి అవుతుంది. 

ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే శ్రమ, రవాణా ఖర్చులు తప్పుతాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వం నుంచే సేవలు పొందవచ్చు. గత ఏడాది నవంబర్‌ 18న ప్రారంభమైన ఈ వాట్సాప్‌ ఛానెల్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఆదాయ ధృవీకరణ పత్రాలు, పోలీసు చాలనాలు, విద్యుత్‌ బిల్లుల చెల్లింపుల కోసం ప్రజలు దీనిని విరివిగా వాడుతున్నారు. 
 
మీసేవ వాట్సాప్‌ సేవలను ఉపయోగించుకోవడం చాలా సులభం. దీని కోసం మీరు ఫాలో చేయాల్సిన స్టెప్స్ ఉన్నాయి ముందుగా మీరు 8096958096 నెంబర్‌ను సేవ్ చేసి పెట్టుకోవాలి. వాట్సాప్‌లోకి వెళ్లి ఈ నెంబర్‌కు హాయ్, హలో అని మెసేజ్ చేయాలి. మీరు మెసేజ్ పంపగానే చాట్‌బాట్ స్పందిస్తుంది. స్క్రీన్‌పై కనిపించే ప్రాంప్ట్‌లను అనుసరిస్తూ మీకు కావాల్సిన సేవను ఎంచుకోండి. ఒక వేళ ఆ సేవకు ఫీజు ఉంటే అక్కడే ఉన్న లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో పేమెంట్‌ పూర్తి చేయవచ్చు. 

Frequently Asked Questions

GHMC మీసేవ వాట్సాప్ నెంబర్ ఏమిటి?

GHMC మీసేవ వాట్సాప్ చాట్‌బాట్ సేవలను 8096958096 నంబర్‌ ద్వారా పొందవచ్చు. ఈ నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకుని, హాయ్ అని మెసేజ్ పంపితే సరిపోతుంది.

GHMC మీసేవ వాట్సాప్ ద్వారా ఏమేం సేవలు పొందవచ్చు?

ఆస్తి పన్ను సేవలు, లైసెన్స్‌ అప్‌డేట్‌లు, జనన ధృవీకరణ పత్రాల సవరణలు, ప్రాపర్టీ డోర్ నంబర్‌ సవరణ, ఇంటి వద్ద జనన/మరణాల నమోదు వంటి తొమ్మిది కొత్త GHMC సేవలను పొందవచ్చు.

మీసేవ వాట్సాప్ సేవలను ఎలా ఉపయోగించాలి?

8096958096 నంబర్‌ను సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పంపండి. చాట్‌బాట్‌ ఇచ్చే సూచనలను అనుసరించి మీకు కావాల్సిన సేవను ఎంచుకోండి.

మీసేవ వాట్సాప్ సేవలు ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే శ్రమ, సమయం, రవాణా ఖర్చులు ఆదా అవుతాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మీ పనులు పూర్తి చేసుకోవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
Bandi Sanjay: పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget