అన్వేషించండి

WhatsApp Feature: మీ వాట్సాప్ అకౌంట్ ఇకపై మరింత సేఫ్.. ఇతరులు వాడితే వెంటనే అలర్ట్

Whatsapp Update: ఆఫీసు కంప్యూటర్స్ తో పాటు మీ పర్సనల్ మొబైల్స్‌లో వాట్సాప్ లాగిన్ అవుతుంటారు. అయితే రెండు డివైజ్ లలో ఒకేసారి వాట్సాప్ వాడితే మీకు అలర్ట్ వచ్చే ఫీచర్ త్వరలో రానుంది.

మీరు వాట్సాప్‌ను మెస్సేజ్‌లతో పాటు ఆడియో, వీడియో కాల్స్‌కు ఉపయోగిస్తుంటారు. అయితే ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌లలో వాట్సాప్ అకౌంట్ ఉపయోగిస్తుంటే కనుక ఇది మీకు కచ్చితంగా శుభవార్త. ఈ ఫేమస్ మెసేజింగ్ యాప్ తాజాగా ఒక కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. దీని ద్వారా యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ యాక్టివిటీపై మరింత నియంత్రణ చేసే అవకాశం ఉంది. 

ఇకపై ఇతర డివైజ్ యాక్టివిటీపై అలర్ట్ 
వాట్సాప్ కొత్త అప్‌డేట్ తర్వాత, మీ WhatsApp అకౌంట్ ఏదైనా ఇతర లింక్డ్ డివైజ్‌లో యాక్టివ్‌గా ఉన్నప్పుడల్లా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. దీనివల్ల మీ అకౌంట్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు.

ఈ ఫీచర్ ఎందుకంత ముఖ్యం

ప్రస్తుతం నెటిజన్లు WhatsApp Web లేదా టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌ల వంటి అనేక డివైజ్‌లలో వాట్సాప్‌ వాడుతున్నారు. ఈ సౌకర్యం ఈజీగా ఉన్నప్పటికీ, ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. చాలా సార్లు వినియోగదారులు పబ్లిక్ లేదా ఆఫీస్ కంప్యూటర్లలో WhatsApp Web లాగిన్ చేసి, త్వరగా వెళ్లే హడావుడి, చాలా ఆలస్యం అయిందని లాగ్‌అవుట్ చేయడం మర్చిపోతుంటారు. అటువంటి పరిస్థితిలో మరొక వ్యక్తి వారి చాట్‌లను చూడటం, చాట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను కొత్త ఫీచర్ ద్వారా పరిష్కరించేందుకు మెటా సంస్థ ప్రయత్నిస్తోంది. 

డివైజ్‌లను ఎలా చెక్ చేస్తారు?

వాట్సాప్ యూజర్లు Linked Devices సెక్షన్‌లోకి వెళ్లి ఏయే డివైజ్‌లు కనెక్ట్ ఉన్నాయో మాన్యువల్‌గా చూసుకోవాలి. అక్కడ నుండి వారు ఏదైనా తెలియని డివైజ్‌ను లాగౌట్ చేయవచ్చు. కానీ చాలా మంది రెగ్యూలర్‌గా చెక్ చేయరు. దీనివల్ల ప్రైవసీతో పాటు డేటా సెక్యూరిటీ ముప్పు పొంచి ఉంటుంది.

కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

కొత్త ఫీచర్ సిస్టమ్ ఈ ప్రక్రియ మొత్తాన్ని లేకుండా చేస్తుంది. ఒకవేళ మీ మెయిన్ ఫోన్, ఏదైనా ఇతర డివైజ్ ఒకేసారి వాట్సాప్ అకౌంట్ యాక్టివ్‌గా ఉంటే, మీకు వెంటనే అలర్ట్ వస్తుంది. ఉదాహరణకు, మీరు ఆఫీసు సిస్టమ్ లో WhatsApp Web లాగౌట్ చేయకుండా అలాగే వదిలేశారనుకోండి, ఎవరైనా దానిని ఉపయోగిస్తుంటే వెంటనే మీ ఫోన్‌కు అలర్ట్ వస్తుంది. దీంతో మీరు వెంటనే లాగ్‌అవుట్ చేయడం లేదా ఇతర సేఫ్టీ యాక్షన్ తీసుకోవడం చేయవచ్చు.

నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది?
మీ మెయిన్ డివైజ్ లేక ఫోన్, ఏదైనా ఇతర లింక్డ్ డివైజ్ ఒకే సమయంలో యాక్టివ్‌గా ఉన్నప్పుడు మాత్రమే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కేవలం ఒకే డివైజ్‌లో వాట్సాప్ వాడుతుంటే కనుక అలర్ట్ రాదు. 

ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుంది 

ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో కనిపించింది. రాబోయే అప్‌డేట్‌లలో దీనిని యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తుంది. దీనివల్ల మీ అకౌంట్ మునుపటి కంటే సురక్షితంగా ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget