Sabitha Indrareddy: రోడ్డు పక్కన వ్యక్తి ఫిట్స్‌తో విలవిల, మాజీ మంత్రి సబిత సాయం - నెట్టింట్లో వైరల్
Rangareddy News: ఫిట్స్ వచ్చి రోడ్డు పక్కన అస్వస్థతతో పడి ఉన్న ఓ బాటసారికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేయూత ఇచ్చి, ఆర్థిక సాయం చేసి ఇంటికి పంపించారు.
![Sabitha Indrareddy: రోడ్డు పక్కన వ్యక్తి ఫిట్స్‌తో విలవిల, మాజీ మంత్రి సబిత సాయం - నెట్టింట్లో వైరల్ Ex Minister Sabitha Indrareddy helps persons on road in rangareddy district telugu news Sabitha Indrareddy: రోడ్డు పక్కన వ్యక్తి ఫిట్స్‌తో విలవిల, మాజీ మంత్రి సబిత సాయం - నెట్టింట్లో వైరల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/19/532179e3a1b1962cab906c82ded777ec1702981616962234_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sabitha Indrareddy News: ఆదుకోవటానికి మంచి మనసు ఉండాలి కానీ పదవులతో ఏం పని అని ఓ మాజీ మంత్రి నిరూపించారు. ఆపదలో ఉన్న ఓ వ్యక్తికి చేయి అందించారు. తెలంగాణలో మాజీ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన సాయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఫిట్స్ వచ్చి రోడ్డు పక్కన అస్వస్థతతో పడి ఉన్న ఓ బాటసారికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేయూత ఇచ్చి, ఆర్థిక సాయం చేసి ఇంటికి పంపించారు.
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఉదయం మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రేణుక ఎల్లమ్మ వారి పూజ కార్యక్రమంలో పాల్గొని తుక్కుగూడ వైపుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఫీట్స్ వచ్చి పడి ఉండగా గమనించిన సబితా ఇంద్రారెడ్డి తన వాహనాన్ని వెనక్కి మళ్లించారు. స్వయంగా తాను కారు దిగి అతణ్ని పరామర్శించారు. తన సిబ్బంది సహాయంతో అతను మాములు స్థితిలోకి వచ్చేలా చేసిన అనంతరం వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన గ్రామం అమన్ గల్ అని.. తన పేరు ఎల్లయ్యగా ఆ వ్యక్తి పేర్కొన్నారు. కొంత నగదు ఇచ్చి అతణ్ని ఆటో ఎక్కించి, అమన్ గల్ కు పంపారు.. సబితా ఇంద్రా రెడ్డి. ఈ సందర్భంగా ఆ వ్యక్తి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంటికి వెళ్లారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)