DGP Anjani Kumar: అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు, అన్నీ పర్యవేక్షిస్తున్నాం: డీజీపీ అంజనీ కుమార్
DGP Anjani Kumar: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని సూచించారు.
DGP Anjani Kumar: తెలంగాణాలో చీఫ్ సెక్రటరీ ద్వారా ప్రతి జిల్లా నుండి వర్షాలపై పర్యవేక్షణ చేస్తున్నామని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్, గ్రే హౌండ్స్ , ఇతర అధికారులంతా కలిసి డీజీపీ కార్యాలయం నుండి పర్యవేక్షణ చేస్తున్న్లు వెల్లడించారు. మొత్తం 2900 మందిని రెస్క్యూ చేసి, పునరావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు. మోచన్ పల్లిలో వరదల్లో చిక్కుకున్న వారిని 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించే ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. అలాగే అత్యవరసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకి రావాలని సూచించారు. అలాగే హైదరాబాద్లోని మూడు కమిషనరేట్లలో పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. ముసారాం బాగ్ బ్రిడ్జ్ పై వరద నీరు కూడా కంట్రోల్ లో ఉందని వివరించారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Morchanpalli is the epicentre of the rescue and relief operation. All departments are working together to save lives.
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 27, 2023
In case of any emergency, dial 100. Stay indoors and stay safe.#TelanganaPolice pic.twitter.com/hWMcxqlW1Q
Due to heavy rains across Telangana State, citizens are advised to come out only for extremely important work at night times. Present situation is currently under control. #TelanganaPolice, from home guard officers to the DG level, are well-prepared, and every hour from each PS… pic.twitter.com/CWcLiypmB7
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 26, 2023
సెల్ఫీ లు తీసుకోవడానికి వచ్చి చాలా మంది ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని డీజీపీ వెల్లడించారు. సెల్ఫీల కోసం జనాలు అస్సలే బయటకు రావొద్దని.. ముఖ్యంగా పిల్లలను తీసుకురావద్దని చెప్పారు. విద్యుత్ స్తంభాల దగ్గరకు అస్సలే వెళ్లకూడదని.. ఏవైనా విద్యుత్ తీగలు పడి ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండాలని వివరించారు. 24 గంటల పాటు డీజీపీ కార్యాలయంలోనే ఉండి రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని సమీక్షిస్తున్నామని స్పష్టం చేశారు.
Early morning Supdt of Police Asifabad Suresh Kumar and his team started the relief work. The Special Party of each district have swung into action and are coordinating. Such times test our capabilities. We are with the community we serve. pic.twitter.com/jHKDyT4kav
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 27, 2023
The Bhupalpalli Police team is trying to reach the critical areas. The SP and other officers are in touch with the stranded people. All are safe. Rescue and Relief operations are on the way. These are testing times for all of us, and the enthusiasm of Police Constable officers… pic.twitter.com/pqMzXXiZVS
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 27, 2023