Bigg Boss Mehaboob: మెహబూబ్ మీద పోలీస్ కేసు... బర్త్ డేకి బుల్లితెర బ్యాచ్‌తో విచ్చలవిడిగా రేవ్ పార్టీ చేశాడా?
Mehaboob Dil Se: యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ దిల్ సే బర్త్ డే జూలై 29న. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ వివాదానికి కారణమైంది. అది రేవ్ పార్టీ అని ప్రచారం జరుగుతోంది.
Mehaboob Dil Se Birthday: మెహబూబ్ దిల్ సే పేరుతో సోషల్ మీడియాలో ఈ యువకుడు పాపులర్. యూట్యూబ్ కోసం కొన్ని మ్యూజిక్ వీడియోలు చేశాడు. ఆ తర్వాత 'బిగ్ బాస్' రియాలిటీ షోకి రావడం వల్ల ఇంకాస్త ఎక్కువ మంది బుల్లితెర వీక్షకులకు తెలిశాడు. సాంగ్స్, గేమ్ షోస్, ఇంకా ఇంస్టాగ్రామ్ వల్ల మెహబూబ్ కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతడి మీద పోలీస్ కేసు నమోదు అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
బర్త్ డేకి బుల్లితెర నటీనటులతో పార్టీ!
Mehaboob Dil Se Birthday Party: జూలై 29న మెహబూబ్ బర్త్ డే. ఈ సందర్భంగా టీవీ ఇండస్ట్రీలో తన క్లోజ్ ఫ్రెండ్స్ కొంత మందితో కలిసి పార్టీ చేసుకున్నారు. హైదరాబాద్ సిటీ పరిధిలోని మేడ్చల్ జిల్లాలో గల ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కంటైనర్ రిసార్టు బుక్ చేసుకున్నారు. అయితే, ఆ పార్టీ పోలీసు రికార్డుల్లోకి ఎక్కింది. మెహబూబ్ తీరు మీద పలు విమర్శలు వస్తున్నాయి.
View this post on Instagram
బర్త్ డే పార్టీనా? విచ్చలవిడి రేవ్ పార్టీనా?
మెహబూబ్ దిల్ సేతో పాటు అతని స్నేహితులు సోమవారం మిడ్ నైట్ ఏర్పాటు చేసుకున్న పార్టీ బర్త్ డే పార్టీ కాదని, అది రేవ్ పార్టీ అని ఆరోపణలు వస్తున్నాయి. పైకి పోలీసులు బర్త్ డే పార్టీ అని చెబుతున్నప్పటికీ... అక్కడ రేవ్ పార్టీ జరిగిందని కొందరు బలమైన ఆరోపణలు చేస్తున్నారు.
మెహబూబ్ షేక్ (Police Case Filed On Mehaboob Dil Se)తో పాటు పార్టీ ఆర్గనైజర్ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారని తెలిసింది. ఆ పార్టీకి ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి లేదట. పార్టీ నిర్వహించిన రిసార్టులో 10 లీటర్ల లిక్కర్ బాటిల్స్, ఐదు లీటర్ల బీర్ బాటిళ్లు లభించడంతో పలు విమర్శలకు, వివాదానికి కారణం అయ్యింది. బర్త్ డే పార్టీలో అంత మద్యం ఎందుకని కొందరు విమర్శలు చేస్తున్నారు.
Also Read: కియారా... ఎల్లోరా శిల్పంలా ఏముందిరా - కిక్ ఇచ్చిన 'గేమ్ ఛేంజర్' బర్త్ డే పోస్టర్
మెహబూబ్ బర్త్ డే పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు?
మెహబూబ్ దిల్ సేతో పాటు పలు వీడియోల్లో డ్యాన్స్ చేసిన అతని ఫ్రెండ్, ఢీ షో కంటెస్టెంట్ శ్వేతా నాయుడు, 'బిగ్ బాస్' ఫేమ్ గీతూ రాయల్, శ్రీ సత్యతో పాటు టీవీ నుంచి సినిమాలకు వచ్చి విజయాలు అందుకుంటున్న 'విరూపాక్ష' ఫేమ్ రవికృష్ణ సహా పలువురు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ విమర్శల పట్ల మెహబూబ్ ఇంకా స్పందించలేదు.
Also Read: చిరు, పవన్, చరణ్ కోసం కథ రాస్తున్న దర్శకుడు - మెగా మల్టీస్టారర్ వర్కవుట్ అయ్యేనా?