Telangana: సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందనలు
BJP MLA Raja Singh | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందనలు తెలిపారు. గోశాల నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: కొత్త గోశాల నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గొత్త గోశాలపై నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ధన్యవాదాలు తెలిపారు. గోమాత గురించి ఆలోచించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. మోడల్ గోశాలలు కడతమాన్నారు. చాలా మంచి విషయం. గో రక్షణ గురించి, గోమాతల రక్షణకు ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ తయారు చేయాలని సీఎంను కోరారు. ఆ స్పెషల్ ఫోర్స్ లో తనను సభ్యుడిగా చేయాలని కోరారు. తెలంగాణలో గోవధను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజా సింగ్ కోరారు.
ఆ పని చేస్తే మీకు మంచి గుర్తింపు దొరుకుతుంది..
ఆవులు, దూడలను, ఎద్దులను పర్మిషన్ లేని స్లేటర్ హౌస్ లో చంపుతున్నారు. దాని గురించి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రేవంత్ రెడ్డి చెప్పాలి. దేశంలోని ముఖ్యమంత్రులలో గోవులకు సేవ చేసే నిజమైన ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే, గుర్తుకు వచ్చే రెండవ పేరు మీదే. మొదటి పేరు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రెండవ పేరు రేవంత్ రెడ్డి చెబుతారు. ఈ పనులు చేస్తే కనుక యావత్ భారత దేశంలో సీఎంకు మంచి గుర్తింపు దొరుకుతుంది అన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.
ఏపీ, తెలంగాణలో గోశాలలో ఆవులు చనిపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి. వాస్తవానికి పలు కారణాలతో గోశాలలో ఆవులు చనిపోతుంటాయి. అందుకు సరైన కారణాలు బయటకు రాకపోవడంతో ప్రభుత్వ వైఫల్యంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తుంటారు. వేములవాడ ఆలయానికి చెందిన గోశాలలో కొన్ని రోజుల కిందట వరుసగా గోవులు చనిపోవడం తెలిసిందే. అయితే అనారోగ్య కారణాలతో అవి చనిపోయాయని ఆలయ అధికారులు, కాంగ్రెస్ నేతలు చెప్పారు. ప్రభుత్వ వైఫల్యమే గోవుల మరణానికి కారణమని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.






















