Bandi Sanjay: హైదరాబాద్‌కు బండి సంజయ్, పార్టీ చీఫ్‌గా ఢిల్లీకి - రాజీనామా చేసి నగరానికి
బండి సంజయ్ హైదరాబాద్ రాగానే, శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించిన బండి సంజయ్ ఆ పదవి నుంచి దిగిపోయాక ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఐదు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లే సమయంలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా, ఇప్పుడు బీజేపీ ఎంపీగా మాత్రమే హైదరాబాద్ కు వచ్చారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో ఉండగానే బండి సంజయ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అధ్యక్ష బాధ్యతలను బీజేపీ అధిష్ఠానం కిషన్ రెడ్డికి అప్పగించింది. బండి సంజయ్ హైదరాబాద్ రాగానే, శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బండి సంజయ్ సమావేశం అయ్యారు. పార్టీలో మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితుల గురించి నడ్డా బండి సంజయ్ కు వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పుకోవాలని కోరగా, వెంటనే రాజీనామా చేశారు. రానున్న రోజుల్లో మోదీ కేబినెట్ లోకి బండి సంజయ్ ను తీసుకొంటామని కూడా నడ్డా హామీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే, కేంద్ర మంత్రి వర్గంలో చేరడానికి బండి సంజయ్ ఇంట్రస్ట్ చూపట్లేదని తెలుస్తోంది.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి బండి సంజయ్ ప్రెస్ మీట్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నెలలోనే కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఉంది.
రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి కార్యకర్తలతో కలిసి పూర్వ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ గారికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తిరుపతి ప్రసాదాన్ని అందించి ఘన స్వాగతం పలకడం జరిగింది.@bandisanjay_bjp #BandiSanjay #BukkaVenuGopal#RajendranagarConstituency pic.twitter.com/ayJA6M8R6C
— Bukka Venu Gopal (@BVG4BJP) July 6, 2023