Dude OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్నా 'డ్యూడ్'! - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచో తెలుసా?
Dude OTT Platform : ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ లవ్ రొమాంటిక్ డ్రామా 'డ్యూడ్' ఓటీటీలోకి వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, స్ట్రీమింగ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Pradeep Ranganathan's Dude Movie OTT Release Date Locked : తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ లవ్ రొమాంటిక్ డ్రామా 'డ్యూడ్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ 6 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్‌తో రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా తాజాగా రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా... నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఆ రోజు నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. దీంతో మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూవీలో ప్రదీప్ సరసన 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే శరత్ కుమార్, రోహిణి, ద్రవిడ్ సెల్వం, హృదు హరూన్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించగా... సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించారు.
Also Read : 'బాహుబలి ది ఎపిక్' కోసం లేపేసిన సాంగ్స్, సీన్స్ ఇవే - ఆ సీన్ వెరీ డిఫికల్ట్ అన్న రాజమౌళి
హ్యాట్రిక్ కొట్టిన ప్రదీప్
దీపావళి స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'డ్యూడ్' బిగ్ సక్సెస్ అందుకుంది. దాదాపు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకెళ్లింది. 'లవ్ టుడే', 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్' మూవీస్‌తో మంచి విజయం అందుకున్న ప్రదీప్ ముచ్చటగా మూడోసారి కూడా హిట్ అందుకున్నారు. ఆ మూవీస్ కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి.
స్టోరీ ఏంటంటే?
రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్) కుమార్తె కుందన (మమితా బైజు). చిన్నప్పటి నుంచీ తన మేనత్త కుమారుడు గగన్ (ప్రదీప్ రంగనాథన్) ను ఇష్టపడుతుంది. అయితే, గగన్‌కు మాత్రం కుందన అంటే ఇష్టం ఉండదు. స్కూల్, కాలేజీల్లో లవ్ ఫెయిల్యూర్ అయి వరుస బ్రేకప్స్ అవుతాయి. గగన్ తనతో పెళ్లికి నిరాకరించినందుకు కుందన డిప్రెషన్ నుంచి బయటపడేందుకు బెంగుళూరు వెళ్లిపోతుంది.
అయితే, ఎప్పుడూ తన పక్కనే ఉన్న అమ్మాయి దూరం కావడంతో గగన్‌కు కుందన అంటే ఇష్టం పెరుగుతుంది. తన మామయ్య దగ్గరకు వెళ్లి పెళ్లి చేయాలని కోరగా ఓకే అంటాడు. దీంతో ఆదికేశవులు అంగీకరిస్తాడు. ఇదే టైంలో బెంగుళూరులో కుందన వేరే వ్యక్తిని ఇష్టపడిందని గగన్‌కు తెలుస్తుంది. దీంతో అతను ఏం చేశాడు? వీరిద్దరి పెళ్లికి వచ్చిన ఇబ్బంది ఏంటి? మరదలి లవ్ కోసం బావ ఏం చేశాడు? వీరి లవ్ సక్సెస్ అయ్యి పెళ్లి పీటలెక్కిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















