Green India Challenge: గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న కంగనా రనౌత్- మొక్కలు నాటిన నటి
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు నటి కంగనా రనౌత్. ఆమెకు ఎంపీ సంతోష్‌కుమార్ 'వృక్ష వేదం' పుస్తకాన్ని అందజేశారు.
బీఆర్‌ఎస్ రాజ్యసభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ శంషాబాద్ ఎయిర్ పోర్టు అవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్క నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. బావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించి కాలుష్యాన్ని నివారించే కార్యక్రమాన్ని ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బాధ్యతగా మొక్కలు నాటాలని కంగనా పిలుపునిచ్చారు. ఈ అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
🌳| Kangana Ranaut planted Saplings in Hyderbad as part of #GreenIndiaChallenge☘️ #KanganaRanaut @KanganaTeam pic.twitter.com/or0fv6YTyy
— Kangana Ranaut Rulez (@KanganaNation) February 22, 2023
ఈ కార్యక్రమంలో కంగనాతోపాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, GIC డైరెక్టర్ బాధావత్ పూర్ణ చందర్ నాయక్ పాల్గొన్నారు. కంగనా రనౌత్ 'వృక్ష వేదం' పుస్తకాన్ని అందజేశారు.
#GreenIndiaChallenge goes to Coimbatore. Delighted to be here along with my wife Rohini at the school run by @ishafoundation and planting a sapling along with students, staff and volunteers. Had an interaction with them to know about their understanding about the nature. pic.twitter.com/DGDLDDoj3L
— Santosh Kumar J (@MPsantoshtrs) February 18, 2023