Telangana: అర్థరాత్రి బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ - కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు
Hyderabad: కేసీఆర్ లీడ్ చేస్తున్న పార్టీ బీఆర్‌ఎస్‌కు ఇది అతి పెద్దగా చెప్పుకోవచ్చు. మండలిలో ఉన్న బలం కూడా తగ్గుతోంది. ఏకంగా ఆరుగు ఎమ్మెల్సీలు ప్లేట్ ఫిరాయించడం ఆందోళన కలిగించే అంశం
BRS MLCs Joined Congress At Midnight : బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించేశారు. గురువారం అర్థరాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా చేరివపోవడంతో ఆపార్టీ మరింత ఇరకాటంలో పడింది.
తెలంగాణలో చరిత్ర రిపీట్ అవుతోంది. గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పరిణామాలు ఇప్పుడు మళ్లీ చూస్తున్నాం. గత పదేళ్లులో చాలా మంది ప్రజాప్రతినిధులు వేరే పార్టీల్లో ఇమడ లేక కారు ఎక్కిన సంగతి ఇంకా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అలాంటి సీన్స్ మళ్లీ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. మొన్నటి వరకు ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌కు వెళ్లే వాళ్లను చూశాం.అధికారం మారేసరికి ఆ పార్టీలో ఉన్న వాళ్లంతా కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు.
ఎలాంటి హడావుడి లేదు. సైలెంట్‌గా ఎమ్మెల్సీలంతా రాత్రికి రాత్రే కేసీఆర్‌కు చేయిచ్చి కాంగ్రెస్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అర్థరాత్రి ఎమ్మెల్సీ భాను ప్రసాద్, బస్వరాజు సారయ్య. దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్, పార్టీ మారిన వారిలో ఉన్నారు. వీళ్లంతా ఒంటిగంట సమయంలో హైదరాబాద్‌లో సీఎం రేవంత్, పార్టీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కేసీఆర్‌కు టాటా చెప్పేసి కాంగ్రెస్‌కు జై కొట్టారు.
ఈ చేరికల వేదికపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయనతోపాటు మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి వచ్చీ రాగానే చేరికలు జరిగిపోయాయి. ఇప్పటికే ఆరుగురు శాసనసభ సభ్యులు కాంగ్రెస్‌లో చేరిపోయారు. కారు గుర్తుపై గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్‌కుమార్, కాలె యాదయ్య హస్తం గూటికి చేరిపోయారు. వీళ్లు కాకుండా ఎలాంటి పదవులు లేని చాలా మంది కూడా కాంగ్రెస్‌లో చేరిపోయారు.