అన్వేషించండి
Advertisement
Eluru News: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం- నలుగురి మృతి- ఓ బాలుడి పరిస్థితి విషమం
Andhra Pradesh News: ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు.
Andhra Pradesh Crime News: ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద కంటైనర్‌ను స్పీడ్‌గా వెళ్లే కారు ఢీ కొట్టింది. నల్లజర్ల వైపు నుంచి రాజమండ్రి వెళ్తున్న వేగంగా వెళ్తున్న కారు కంటైనర్‌ను ఢీ కొనడంతో నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో ఓ బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
స్పీడ్‌గా వెళ్తూ కంటైనర్‌ను ఢీ కొన్న దెబ్బకు కారు నుజ్జునుజ్జైపోయింది. దీంతో మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. తీయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. అతి కష్టమ్మీద మృతదేహాలను తీయించిన పోలీసులు పోస్టుమార్టానికి పంపించారు. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా పోలీసులు నిర్దారించారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఇండియా
కర్నూలు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion