By: ABP Desam | Updated at : 09 Feb 2023 05:25 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
టీఎస్ఆర్టీసీ
TSRTC : టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని ప్రకటించింది. అన్ని రకాల బస్సు సర్వీస్‌లపై 10 శాతం రాయితీ వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 30 వరకు అద్దె బస్సులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని తెలిపింది.
అద్దె బస్సులపై రాయితీ
పెళ్లిళ్ల సీజన్ కావడంతో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని కల్పించనున్నట్లు తెలిపింది. అన్ని రకాల బస్సు సర్వీసులపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. 2023 జూన్ 30 వరకు అద్దె బస్సులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని ప్రకటించింది. గతంలో పండుగలు, కార్తీక మాసం, వనభోజనాలు, శబరిమల అయ్యప్ప దర్శనం సమయాల్లో అద్దె బస్సులకు టీఎస్ఆర్టీసీ రాయితీ కల్పించింది. 2022 డిసెంబర్ 31తో ఆ రాయితీ గడువు ముగిసింది. తాజాగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో మరోసారి రాయితీ నిర్ణయం తీసుకుంది. అద్దె బస్సులో ప్రయాణాలకు 10 శాతం రాయితీ కల్పించాలని అధికారులు సూచించారు.
పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో #TSRTC కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని కల్పిస్తోంది. అన్ని రకాల బస్ సర్వీస్‌లపై 10 శాతం రాయితీ ఇస్తోంది. ఈ ఏడాది జూన్ 30 వరకు అద్దె బస్సులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుంది. pic.twitter.com/n9Ww51rtOI
— TSRTC (@TSRTCHQ) February 9, 2023
బుకింగ్ కోసం
పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పించినట్లు టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనర్ ప్రకటించారు. ప్రైవేట్ వాహనాల కన్నా చాలా తక్కువ ధరకే ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తుందని తెలిపారు. ఎలాంటి నగదు డిపాజిట్ లేకుండానే అద్దె బస్సుల సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. బస్సుల బుకింగ్ కోసం www.tsrtconline.in వెబ్ సైట్ ను సందర్శించాలన్నారు. ఇతర వివరాల కోసం స్థానిక డిపో మేనెజర్లను సంప్రదించాలని సూచించింది.
డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభం
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. నిజాం కాలంలో తిరిగిన బస్సులను గుర్తుచేస్తూ మళ్లీ భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ చర్యల్లో భాగంగా 3 బస్సులను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ అందాలను ఆస్వాదిస్తూ డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభూతి అని గతంలో ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, ఆ అనుభూతిని నగరవాసులకు తిరిగి అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. త్వరలో మరిన్ని డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. మంత్రి కేటీఆర్ మాటిచ్చిన రెండు సంవత్సరాల్లో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు. ఏ రూట్లలో తిరగబోతున్నాయనే దానిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. నగరంలోని పర్యాటక ప్రదేశాలను చుట్టివచ్చేలా వీటి రూట్ మ్యాప్ ఉంటుందని తెలుస్తోంది. రోజు రోజుకూ కొత్త మెరుగులు దిద్దుకుంటున్న హైదరాబాద్‌కు డబుల్ డెక్కర్ బస్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయాని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇవి ఎలక్ట్రిక్ బస్సులు కావడంతో పర్యావరణానికి హాని కూడా ఉండదంటున్నారు.
We will have a fleet of 25-30 such Double deckers plying in Hyderabad within next 6 months@arvindkumar_ias please coordinate with TSRTC https://t.co/cnxMz86CFs
— KTR (@KTRBRS) February 7, 2023
Medical Collages: 50 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం - ఏపీ, తెలంగాణకు ఎన్నంటే
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం
TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!
KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్
Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!
Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
IND VS AUS: 469కు ఆస్ట్రేలియా ఆలౌట్ - నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్!