By: ABP Desam | Updated at : 28 Oct 2021 08:25 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
హైదరాబాద్ లో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు
ఇటీవల హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ వేడుకలు(ప్లీనరీ) నిర్వహించారు. ఈ ప్లీనరీకి నగరంలో ఆ పార్టీ నేతలు భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటుచేశారు. టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై బీజేపీ విమర్శలు చేసింది. ఈ ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్మెంట్ సెల్ స్పందించింది. టీఆర్ఎస్ ప్లీనరీ ఫ్లెక్సీల ఏర్పాటుకు భారీగా జరిమానాలు విధించింది. అత్యధికంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కు రూ.2 లక్షల 35 వేల జరిమానా, మంత్రి తలసానికి రూ.లక్ష 5 వేల జరిమానా, మంత్రి మల్లారెడ్డికి రూ.10,000, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి రూ.25 వేలు జరిమానా వేసింది. సర్వర్ అప్ గ్రేడేషన్ తో నేటి నుంచి మళ్లీ చలానాలు జనరేట్ జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ తెలిపింది. టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పేరుతో రూ. 95000 జరిమానా వేశారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు రెండు లక్షలు జరిమానా విధించారు.
Also Read: అలా అయితే రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుందిగా ? కేసీఆర్‌కు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ !
వెబ్ సైట్ పనిచేయలేదు
టీఆర్ఎస్ ప్లీనరీ టైంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలపై విమర్శలు వచ్చాయి. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఒక్కో ఫ్లెక్సీకి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానాలు విధించింది. ఈ నెల 21 నుంచి ఈవీడీఎం (డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్) వెబ్‌సైట్ పనిచేయలేదని, వెబ్‌సైట్‌ను గురువారం తిరిగి పునరుద్ధరించామని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొంది. ఫ్లెక్సీల ఏర్పాటుకు బాధ్యులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జరిమానాలు విధించామని అధికారులు తెలిపారు. ఈనెల 25న హైదరాబాద్ హైటెక్స్‌లో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం నిర్వహించారు.
Also Read: షర్మిలపై మంత్రి నిరంజన్ రెడ్డి అసభ్య వ్యాఖ్యలు.. కుక్క అని మండిపడ్డ వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు !
బీజేపీ ఆందోళనలు
నగరంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, కటౌట్లు తొలగించాలని బీజేపీ నేతలు ప్లీనరీ జరిగిన రోజున జీహెచ్ఎంసీ వద్ద ఆందోళన చేశారు. బుద్ద భవన్ లోని జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. పోలీసులు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారి విశ్వజిత్ ను సస్పెండ్ చేయాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా చేసింది. జీహెచ్ఎంసీ ఆధికారి విశ్వజిత్ టీఆర్ఎస్ పార్టీ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. గతంలో ప్రతిపక్షాలు ఫ్లేక్సీలు ఏర్పాటుచేస్తే వాటిని తొలగించారని, జరిమానా వేశారని తెలిపారు.
Also Read: హుజూరాబాద్ లో ఫేక్ లెటర్ల లొల్లి.... వాస్తవాలు బయటపెట్టిన ఏబీపీ దేశం...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
TSPSC Leak Case : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ చార్జిషీట్ - సంచలన విషయాలేమున్నాయంటే ?
Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఏమందంటే?
Saroornagar Murder: నా కొడుకు అందుకే హత్య చేసి ఉండొచ్చు - కీలక విషయాలు చెప్పిన నిందితుడి తండ్రి
TS Inter Exams: ఇంటర్ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
Top 10 Headlines Today: ఢిల్లీ నుంచి ఈటలకు పిలుపు; సీఎం జగన్ కీలక హామీ - నేటి టాప్ 5 న్యూస్
Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !
సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ
టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు
Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్