Perni Nani : అలా అయితే రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుందిగా ? కేసీఆర్‌కు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ !
ఏపీలోనూ టీఆర్ఎస్‌ను పెడతామన్న కేసీఆర్‌కు వైఎస్ఆర్‌సీపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. రెండు రాష్ట్రాలను కలిపేసి పోటీ చేస్తే మంచిదన్నారు. ఈ మేరకు కేబినెట్‌లో తీర్మానం చేయాలని సలహా ఇచ్చారు.
![Perni Nani : అలా అయితే రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుందిగా ? కేసీఆర్‌కు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ! AP Minister Perni Nani commented that if the two Telugu states are merged, TRS can also compete in the AP Perni Nani : అలా అయితే రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుందిగా ? కేసీఆర్‌కు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/14/c6f3695aea0ea9f93a5d4630f3fe3196_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ పెట్టాలని .. గెలిపించుకుంటామని కొన్ని వేల మంది తనకు ఫోన్లు చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. " రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు? రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా" అని కేసీఆర్‌కు సలహా ఇచ్చారు. ఏపీలో పార్టీ పెట్టే ముందు తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం పెడితే బాగుంటుందని ఆయన సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలపాలనే తీర్మానాన్ని కేసీఆర్ పెడితే.. ఆ తర్వాత ప్రత్యేకంగా పార్టీ పెట్టాల్సిన అవసరం ఉండదని.. ఏ ఇబ్బంది లేకుండా పోటీ చేయవచ్చని గుర్తు చేశారు.
Also Read : జూన్ నుంచి అమ్మఒడి.. అదానీకి విశాఖలో 130 ఎకరాలు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు !
రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిపోతే ఏపీలో కేసీఆర్ పోటీ చేయడానికి అడ్డేముంటుందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలపైనా ఆయన సెటైర్లు వేశారు. సీఎం కేసీఆర్ పథకాలపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర మైక్ పెడితే బాగా చెప్తారని ఎద్దేవా చేసారు. తెలంగాణలో వెలుగులు ఉంటే ఏపీలో చీకట్లు ఉన్నాయని.. ఏపీ ప్రజల తలసరి ఆదాయం కంటే తెలంగాణ ప్రజల తలసి ఆదాయం చాలా ఎక్కువ అని కేసీఆర్ సభలో వ్యాఖ్యానించారు. అయితే ఏపీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల విషయంలో వైఎస్ఆర్‌సీపీ ఆచితూచి స్పందిస్తోంది.
Also Read : రాజకీయాల్లోకి వీవీఎస్ లక్ష్మణ్ ! బీజేపీ మైండ్ గేమా ? నిజమా ?
బుధవారం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని స్పందించారు. కేసీఆర్‌ను ఎవరూ ఆపలేదన్నారు. అయితే ఆయనకు మించి ఘాటుగా పేర్ని నాని సమాధానం ఇచ్చారు. రెండు రాష్ట్రాలను కలిపేయాలని సూచించారు. కేసీఆర్ ఆషామాషీగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని.. ఏదో వ్యూహంతోనే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ నేతలు భావించడం వల్లనే కాస్త ఘాటుగా ఎదురుదాడి చేస్తున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read : జగన్‌ను చూసేందుకు వచ్చా ! భేటీ వ్యక్తిగతమేనన్న నాగార్జున !
రెండు రాష్ట్రాలను కలిపితే ఏపీలోనూ పోటీ చేయవచ్చన్న పేర్ని నాని వ్యాఖ్యలు తెలంగాణలోనూ హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసమే ఏర్పడిన టీఆర్ఎస్ మౌలిక సిద్ధాంతానికి ఏపీలో పోటీ చేయడం.. ఏపీలో పార్టీ పెట్టడం అనేది సరిపడదని అంటున్నారు. పేర్ని నాని వ్యాఖ్యలపై టీఆర్ఎస్ స్పందన ఎలా ఉంటుందోననన్న ఆసక్తి కనిపిస్తోంది.
Also Read : అమరావతి రైతుల మహా పాదయాత్ర ! అనుమతిపై టెన్షన్ పెడుతున్న పోలీసులు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)