VVS Laxman : రాజకీయాల్లోకి వీవీఎస్ లక్ష్మణ్ ! బీజేపీ మైండ్ గేమా ? నిజమా ?
మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ బీజేపీలో చేరబోతున్నారంటూ ఒక్క సారిగా ప్రచారం ప్రారంభమయింది. బీజేపీ వర్గాలే అఫ్ ది రికార్డ్‌గా చెబుతున్నాయి. కానీ లక్ష్మణ్ వైపు నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారని.. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమయిందన్న ప్రచారం జరుగుతోంది. అమిత్ షా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బీజేపీ వర్గీయులు మీడియాకు ఆఫ్ ది రికార్డ్ సమాచారం అందించారు. వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని ... బీజేపీలో చేరేందుకు అంగీకరించారని అంటున్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవేళ్లలో ఏదో ఓ ఓ స్థానం నుంచి పార్లమెంట్ బరిలో నిలబడేందుకు లక్ష్మణ్ అంగీకరించారని చెబుతున్నారు.
తొమ్మిదేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన లక్ష్మణ్ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టకు మెంటార్‌గా ఉన్నారు. క్రికెట్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ ఆరంగేట్రంపై వీవీఎస్ లక్ష్మణ్ వైపు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. ఆయన చెప్పిన తర్వాతనే ఇది నిజమని క్లారిటీకి రావొచ్చు. లక్ష్మణ్ ఎప్పుడూ రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లుగా ప్రకటనలు చేయలేదు. ఆయనకు దైవభక్తి మెండు. సాయిబాబాపై ఆయన కొన్ని పాటలు రాశారు. కానీ రాజకీయాల గురించి మాత్రం ఆయన వైపు నుంచి ఇప్పటి వరకూ ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి చర్చ ప్రారంభమయింది.
Also Read: Shami Latest News: పాక్ దొంగబుద్ధి..! షమీపై అసత్య ప్రచారంతో మైండ్‌గేమ్.. ఇవిగో సాక్ష్యాలూ..!
అయితే బీజేపీకి సినిమా, క్రికెట్ సెలబ్రిటీల్ని ఆకట్టుకుని ఎన్నికల బరిలోకి దించడంలో ప్రత్యేకమైన ట్రాక్ రికార్డు ఉంది. ముఖ్యంగా బీజేపీ ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఇలాంటి సెలబ్రిటీలను ఎక్కువగా ఆకట్టుకుని బరిలో నిలబెడుతుంది. బెంగాల్‌లో కూడా ఇదే ఫార్ములాతో అనేక మంది సినీ, టీవీ, క్రికెటర్లను పార్టీలో చేర్చుకుని బరిలో నిలబెట్టారు. గౌతం గంభీర్‌ను ఢిల్లీ నుంచి ఎంపీని చేశారు. ఇప్పుడు అదే వ్యూహం తెలంగాణలో అమలు చేయదల్చుకుంటే మాత్రం వీవీఎస్ లక్ష్మణ్‌కు ఆఫర్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read : షర్మిల పాదయాత్రలో మెరిసిన యాంకర్ శ్యామల.. కారణం ఏంటంటే..
క్రికెటర్లుగా రాణించి రాజకీయాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. కానీ నిలదొక్కుకున్న వారు కొందరే ఉన్నారు. వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఒక వేళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే అది బీజేపీ వత్తిడి వల్లే కానీ వ్యక్తిగత ఆసక్తి అయి ఉండదని అంటున్నారు. ఈ అంశంపై లక్ష్మణ్ వైపు నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
Also Read: Cyberabad traffic police: ఇదేందయ్యా ఇదీ.. ఎక్కడి నుంచి చూస్తున్నారయ్యా?!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి