Sharmila Vs Niranjan : షర్మిలపై మంత్రి నిరంజన్ రెడ్డి అసభ్య వ్యాఖ్యలు.. కుక్క అని మండిపడ్డ వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు !
షర్మిలను మంగళవారం మరదలు అని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించడం వివాదాస్పదమవుతోంది. షర్మిల.. మంత్రి నిరంజన్ రెడ్డిని కుక్కగా అభివర్ణించారు.
తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల గురించి మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణం అవుతున్నాయి. ఉద్యోగాల భర్తీకి డిమాండ్ చేస్తూ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహారదీక్ష చేస్తున్నారు. నాగర్ కర్నూల్‌లో టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాట్లాడిన నిరంజన్ రెడ్డి షర్మిలపై విమర్శలు చేశారు. " ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలు దేరింది. ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయాలనే ఆమె డిమాండ్ వెనుక 20 శాతం కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయి" అని మంత్రి ఆరోపించారు.
ఇతర విమర్శల సంగతేమో కానీ "మంగళవారం మరదలు" అనడం వివాదాస్పదం అయింది. మీడియాలో.. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. మంత్రి నిరంజన్ వ్యాఖ్యలను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఖండించింది. నిరంజన్ రెడ్డి సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారని వైఎస్అర్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి సత్యవతి మండిపడ్డారు. నిరంజన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పద్దతి మార్చుకోకపోతే చీపుర్లు తిరగేసి కొడతామని హెచ్చరించారు. షర్మిల ఇమేజ్‌ను మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు దెబ్బతీసేలా ఉండటంతో.. వైఎస్ఆర్‌టీపీ నేతలు ఈ అంశాన్ని ఇంతటితో వదిలేయకూడదని నిర్ణయించుకున్నారు.
Also Read : రాజకీయాల్లోకి వీవీఎస్ లక్ష్మణ్ ! బీజేపీ మైండ్ గేమా ? నిజమా ?
పాదయాత్రలో ఉన్న షర్మిల కూడా మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. చందమామను చూసి కుక్కలు మొరుగుతాయన్నారు. కుక్కలకు కుక్కబుద్ది ఎక్కడకు పోతుందని ప్రశ్నించారు. సంస్కారం లేని కుక్కలు టీఆర్ఎస్‌లో ఉన్నారని.. ఈ కుక్కకు కల్వకుంట్ల కవిత ఏమవుతుందని ప్రశ్నించారు. ఈ కుక్కలను తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.
Also Read : ‘వరి-ఉరి’ పేరుతో బండి సంజయ్ దీక్ష.. మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్
రాజకీయ నేతలు ఇటీవలి కాలంలో దారుమమైన భాషతో విమర్శలు చేసుకుంటున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విషయంలో ఎలాంటి విమర్శలు చేయవద్దని .. అనవసరంగా ప్రాధాన్యం ఇవ్వవొద్దని టీఆర్ఎస్ హైకమాండ్ తమ పార్టీ నేతలకు సూచించింది. అయితే మంత్రి నిరంజన్ రెడ్డి ఏ ఉద్దేశంతో అన్నారో కానీ షర్మిలపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దానికి కూడా ఆమె గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ విమర్శలు ఓ రేంజ్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: హుజూరాబాద్ లో లెటర్ల లొల్లి.. దళిత బంధు ఆపింది ఈటలే అంటున్న టీఆర్‌ఎస్.. కాదు.. కాదంటున్న బీజేపీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి