X

Hyderabad Raid Today: కార్వీ ఆఫీసు, ఆస్తులపై పలుచోట్ల ఈడీ దాడులు.. బెంగళూరు పోలీసుల కస్టడీకి మాజీ ఎండీ పార్థసారధి

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ కేసులో ఆఫీసుతో పాటు సంస్థ మాజీ ఎండీ పార్థసారధి, ఇతర డైరెక్టర్లు, బాస్‌లు రాజీవ్ రంజన్, కృష్ణ ఇళ్లలో బుధవారం ఉదయం నుంచి సుదీర్ఘంగా ఈడీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.

FOLLOW US: 

ED Raids Karvy Office: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ కేసు విచారణలో భాగంగా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని కార్వీ ఆఫీసుతో పాటు సంస్థ మాజీ ఎండీ పార్థసారధి, ఇతర డైరెక్టర్లు, బాస్‌లు రాజీవ్ రంజన్, కృష్ణ ఇళ్లలో బుధవారం ఉదయం నుంచి సుదీర్ఘంగా ఈడీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. డీ మ్యాట్ ఖాతాల నుండి షేర్‌లను బదలాయించడం ద్వారా భారీ మొత్తం కార్వీ యాజమాన్యం రుణాలు తీసుకుంది.

మనీ లాండరింగ్ కేసు 
రూ. 350 కోట్ల మేర భారీ రుణాలను పొందిన సంస్థ.. ఈ మొత్తాన్ని వ్యక్తిగత ఖాతాలకు బదలాయించింది. దీంతో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు కార్వీ సంస్థపై, డైరెక్లర్లు, ఉన్నతోద్యోగులపై అభియోగాలు నమోదయ్యాయి. కార్వీ కేసులో మాజీ ఎండీ పార్థసారధిని బెంగళూరు పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు తాజాగా అనుమతించింది. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కార్వీ సంస్థపై పలు కేసులు నమోదయ్యాయి.

Also Read: TTD High Court : 52 మంది టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులకు షాక్ .. జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు

పీటీ వారెంట్‌పై విచారణ 
వందల కోట్ల రుణాలు తీసుకుని వ్యక్తిగత ఖాతాలకు వాటిని బదలాయించి నిధులు గోల్ మాల్ చేశారని అభియోగాలున్నాయి. కస్టమర్ల నగదు ఏమైందనే కోణంలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ కేసులో సంస్థ మాజీ ఎండీ పార్థసారధితో పాటు సీఈవో రాజీవ్ రంజన్, సీఎఫ్‌వో కృష్ణహరిలను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. బెంగళూరు క్రైమ్ పోలీసులు నిందితుల పీటీ వారెంట్‌పై విచారణ చేపట్టారు. నేటి ఉదయం నుంచి కార్వీ ఆఫీసుతో పాటు నగరంలోని పలు చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. బంజారాహిల్స్, నానక్‌రాంగూడా, అమీర్‌పేట్‌ సహా సంస్థకు చెందిన ఆస్తులు, మాజీ ఎండీ, డైరెక్టర్లు, సీఈవోల ఇళ్లపై పలు చోట్ల సీఆర్‌పీఎఫ్ భద్రతతో ఈడీ తనిఖీలు కొనసాగిస్తోంది.

Also Read: హైవేపై కండోమ్ కేసులో కళ్లుచెదిరే ట్విస్ట్.. సొరంగంలో శృంగార భోగాలు! 

బెంగళూరు పోలీసుల కస్టడీకి నిందితులు..

కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో మాజీ ఎండీ పార్థసారధిని బెంగళూరు పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్‌ స్టేషన్‌లో సెప్టెంబర్ 8న పార్థసారధిపై కేసు నమోదుచేశారు. వంద కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డ కేసులో సంస్థ మాజీ ఎండీతో పాటు రాజీవ్‌ రంజన్‌, కృష్ణపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుల పీటీ వారెంట్‌పై 3 రోజుల కస్టడీకి బెంగళూరు పోలీసులు అనుమతి కోరడంపై నాంపల్లి కోర్టు తాజాగా సమ్మతించింది. చంచల్‌గూడ జైలులోని నిందితులను కర్ణాటక పోలీసులు విచారించనున్నారు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: telangana Hyderabad ED Raids In Karvy Scam Probe Karvy Scam Probe Karvy Office ED Raid ED Raids At Karvy Office

సంబంధిత కథనాలు

Minister Srinivas Goud: ఏడేళ్ల పసికూన దేశం గర్వించే స్థాయిలో అభివృద్ధి... ప్లీనరీ సక్సెస్ తో ప్రత్యర్థుల్లో గుబులు... మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు

Minister Srinivas Goud: ఏడేళ్ల పసికూన దేశం గర్వించే స్థాయిలో అభివృద్ధి... ప్లీనరీ సక్సెస్ తో ప్రత్యర్థుల్లో గుబులు... మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు

Breaking News Live Updates: ముంబయి డ్రగ్స్ కేసులో ఇద్దరికి బెయిల్ 

Breaking News Live Updates:  ముంబయి డ్రగ్స్ కేసులో ఇద్దరికి బెయిల్ 

AP TS Corona Updates:ఏపీలో తగ్గుతున్న కోవిడ్ ఉద్ధృతి... కొత్తగా 415 కరోనా కేసులు, పెరిగిన రికవరీలు... తెలంగాణలో 190 కేసులు

AP TS Corona Updates:ఏపీలో తగ్గుతున్న కోవిడ్ ఉద్ధృతి... కొత్తగా 415 కరోనా కేసులు, పెరిగిన రికవరీలు... తెలంగాణలో 190 కేసులు

TSRTC UPI Payments: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం.... జూబ్లీ బస్టాండ్ లో యూపీఐ పేమెంట్స్ ప్రారంభం

TSRTC UPI Payments: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం.... జూబ్లీ బస్టాండ్ లో యూపీఐ పేమెంట్స్ ప్రారంభం

Huzurabad BJP : రైల్వేస్టేషన్ల అభివృద్ధి.. రైతులకు పెన్షన్లు.. హుజురాబాద్ కోసం బీజేపీ మేనిఫెస్టో !

Huzurabad BJP :  రైల్వేస్టేషన్ల అభివృద్ధి.. రైతులకు పెన్షన్లు.. హుజురాబాద్ కోసం బీజేపీ మేనిఫెస్టో !
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Amazon Festival Sale: తెలుగువారు ఎక్కువగా కొంటున్న ఉత్పత్తులపై అమెజాన్‌ ఆఫర్లు.. ఏంటో తెలుసా?

Amazon Festival Sale: తెలుగువారు ఎక్కువగా కొంటున్న ఉత్పత్తులపై అమెజాన్‌ ఆఫర్లు.. ఏంటో తెలుసా?

Ritu Varma: ఇంట్లో ఇబ్బంది లేదు... పెళ్లి నిర్ణ‌యం నాదే!

Ritu Varma:  ఇంట్లో ఇబ్బంది లేదు... పెళ్లి నిర్ణ‌యం నాదే!

Sreemukhi Photos: ట్రెండీ లుక్ లో శ్రీముఖి.. ఫొటోలు వైరల్

Sreemukhi Photos: ట్రెండీ లుక్ లో శ్రీముఖి.. ఫొటోలు వైరల్

Samantha Defamation Case: సమంత కేసులో కోర్టు తీర్పు ఇదే.. పర్సనల్ విషయాలను షేర్ చేయొద్దని సూచన.. 

Samantha Defamation Case: సమంత కేసులో కోర్టు తీర్పు ఇదే.. పర్సనల్ విషయాలను షేర్ చేయొద్దని సూచన..