Tumkur Condom Case: హైవేపై కండోమ్ కేసులో కళ్లుచెదిరే ట్విస్ట్.. సొరంగంలో శృంగార భోగాలు!
కర్ణాటక తుముకూరు హైవే కండోమ్‌లు కనిపించిన కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. అదేంటంటే?
కర్ణాటకలోని తుముకూరు సమీపంలో ఇటీవల కుప్పులు తెప్పలుగా కనిపించిన కండోమ్‌ల కేసు గుర్తుందా? అసలు ఈ కండోమ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేసిన పోలీసులు ఎట్టకేలకు కేసును ఛేదించారు. అయితే ఈ కేసులో ట్విస్ట్ చూసి పోలీసులే షాకయ్యారు.
అసలేం జరిగింది?
ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైవే దగ్గర్లోని లాడ్జిలో పోలీసులు సోదాలు చేశారు. అయితే ఆ లాడ్జిలో ఓ భారీ సొరంగాన్ని గుర్తించారు. ఆ సొరంగం తలుపు తెరిచిన పోలీసులు అవాక్కయ్యారు. అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. కండోమ్‌లు ఇక్కడి నుంచే వచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సొరంగంలో నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. లాడ్జిని తాత్కాలికంగా మూసివేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read:Viral fever in India: చిన్నారుల్లో వైరల్ ఫీవర్.. ఇప్పటికే 100 మంది మృతి.. పిల్లలను ఎలా కాపాడుకోవాలి?
అరెస్ట్..
ఈ కేసుపై తుమకూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒడనాడి సేవా ట్రస్ట్ సహకారంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కండోమ్‌ల కేసులో ఇప్పటివరకు ఐదుగురిని తుమకూరు పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: Covaxin for kids: చిన్నారులకు కొవాగ్జిన్ టీకా.. శుభవార్త చెప్పిన భారత్ బయోటెక్
కేసు ఇది..
ರಾಷ್ಟ್ರೀಯ ಹೆದ್ದಾರಿಯಲ್ಲಿ ಕಿಲೋಮೀಟರ್ ಗಟ್ಟಲೆ ಕಾಂಡೋಮ್ಗಳುhttps://t.co/JPql1oAEVihttps://t.co/ETbtYSNVo2#Vishwavani #KannadaNews #KannadaDaily #Condom #Tumkur pic.twitter.com/bxVPXhzcRE
— Vishwavani (@VishwavaniNews) September 8, 2021
కర్ణాటక తుముకూరు శివారులోని జాతీయ రహదారి 48పై ఇటీవల వందల సంఖ్యలో కండోమ్‌లు దర్శనమిచ్చాయి. ఇది చూసి అటుగా వెళ్లే వాహనదారులు ఆశ్చర్యపోయారు. శ్రీరాజ్ థియేటర్‌కు ఎదురుగా ఉన్న ఓ ఫ్లైఓవర్‌పై కండోమ్‌లు కుప్పలుగా కనిపించాయి. అయితే ఇందులో కొన్ని వినియోగించిన కండోమ్‌లు ఉండగా మరికొన్ని ప్యాకెట్లలో ఉన్నాయి. ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కేసులు ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు వేగవంతం చేశారు.
హైవే దగ్గర్లో ఉన్న లాడ్జిల్లో రైడ్ చేశారు. ఈ సోదాల్లో భాగంగా ఓ లాడ్జిలో ఈ సొరంగం దర్శనమిచ్చింది. ఆ సొరంగాన్ని వ్యభిచారానికి వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.