Bandi Sanjay : కేసీఆర్ ఇదిగో మీ అబద్దాల చిట్టా- పోస్టర్ విడుదల చేసిన బండి సంజయ్
Bandi Sanjay : సీఎం కేసీఆర్ హామీలిచ్చి విస్మరిస్తారని వాటిని ఎప్పుడూ అమలుచేయలేదని బండి సంజయ్ ఆరోపించారు.
Bandi Sanjay : సీఎం కేసీఆర్ వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ బీజేపీ "కేసీఆర్ ఝూఠా మాటలు" పోస్టర్లు రూపొందించింది. ఝూఠా మాటల కేసీఆర్... ఇదిగో నీ అబద్దాల చిట్టా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ పోస్టర్లను మంగళవారం మర్రిగూడలోని క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డిలతో కలిసి రిలీజ్ చేశారు. మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ మరోసారి పచ్చి అబద్దాలు, మోసాలు, తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. మందు, మాంసం, మనీతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు మునుగోడు ఎన్నిక ఫలితాలపై ఆధారపడి ఉందన్నారు.
ఝూఠా మాటల కేసీఆర్... ఇదిగో నీ పచ్చి అబద్ధాల చిట్టా అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @bandisanjay_bjp ‘‘కేసీఆర్ ఝూఠా మాటలు’’ పోస్టర్లను విడుదల చేశారు. మర్రిగూడలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ ఎన్.ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. pic.twitter.com/5WCLA3DrLV
— BJP Telangana (@BJP4Telangana) October 25, 2022
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలంటూ బీజేపీ పోస్టర్
- ఒక దళిత నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తా. నేను చెప్పిన అంటే తల నరుక్కుంటా గానీ, ఆ మాట తప్పను. కచ్చితంగా, ఎట్టిపరిస్థితుల్లో రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటారు.
- దళితులకు మూడెకరాల భూమి ఇస్తాను
- 125 అడుగుల ఎత్తుతో అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మిస్తాను
- ప్రతీ మండలంలో అంబేడ్కర్ వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తాం
- బంగారు తెలంగాణలో రైతు ఆత్మహత్యలుండవు
- రైతులు పండించిన ఆఖరి గింజవరకు మేమే కొంటాం
- తెలంగాణలోని ప్రతీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని మనవి చేస్తున్నాను
- రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ రూ.3,016 ల నిరుద్యోగభృతి
- ప్రతీ సంవత్సరం టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తాం
- తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం
- నియోజకవర్గానికో పాలిటెక్నిక్ కాలేజీ కట్టిస్తాం
- కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్య తప్పకుండా అమలు చేస్తాం
- విద్యార్థులకు సకాలంలో ఫీజురీయాంబర్స్‌మెంట్ అందిస్తాం
- తెలంగాణలో ప్రతి లంబాడీ తాండాలో, ప్రతి గోండు గూడెంలో, ఊరికి దూరంగా ఉండే బస్తీల్లో, ప్రతీ ఇంటికి ప్రభుత్వఖర్చుతో నల్లా పెట్టించి, మంచినీళ్ల తెచ్చి ఆ మంచి నీళ్లతోనే మీ పాదాలు కడుగుతా, కడిగినంకనే ఓట్లు అడుగుతాను
- ఇలా హామీలు ఇచ్చి నెరవేర్చలేదని బండి సంజయ్ ఆరోపించారు. ఈ పోస్టర్ బీజేపీ నేతలు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారంచేయాలని కోరారు.