TG Ration Card Status online: మీకు తెల్ల రేషన్ కార్డ్ మంజూరైందా? అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
White Ration card application status Telangana | తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేస్తోంది. అయితే మీకు రేషన్ కార్డు మంజూరైందో లేదో ఇలా తెలుసుకోండి.

Telangana Ration Card List Check Online Status | హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఈ గ్యారెంటీల అమలుకు తెల్ల రేషన్ కార్డు (TG Ration Card) తప్పనిసరి అవుతోంది. రేషన్ కార్డు లేకపోతే అర్హులైన నిరుపేదలైనా తిప్పలు తప్పడం లేదు. తెల్ల రేషన్ కార్డు లేకపోవడంతో ప్రజా పాలనలో దరఖాస్తులు ఇచ్చిన వారు, అనంతరం ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభలలో దరఖాస్తులు ఇచ్చిన వారు, మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసిన వారు సైతం చాలా మంది అనర్హులుగా ఉన్నారు. నిరుపేదల సమస్యను తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది జనవరిలో తెల్ల రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది.
తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులను ఇదివరకే రెండు దఫాలుగా మంజూరు చేసింది. పాత రేషన్ కార్డు లోని పేర్లలో మార్పులు చేరుకులతోపాటు కొత్త తెల్ల రేషన్ కార్డులను ప్రభుత్వం అందిస్తుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో జులై 14న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కొత్తగా మంజూరైన 3.58 లక్షల రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు. తెలంగాణలో మొత్తం రేషన్ కార్డులు 95,56,625కు చేరగా, లబ్ధిదారులు 3 కోట్లు దాటారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
రేషన్ కార్డు స్టేటస్ (TG Ration Card Status) తెలుసుకునేందుకు వెబ్‌సైట్
తెల్ల రేషన్ కార్డు మంజూరు అయిందా లేదా అనే విషయం తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమకు తెల్ల రేషన్ కార్డు కావాలని ప్రభుత్వాసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం వెబ్సైట్ https://epds.telangana.gov.in/FoodSecurityAct/ ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవాలని దరఖాస్తుదారులకు అధికారులు సూచించారు.
- ముందుగా https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్సైట్లోకి వెళ్లిన తర్వాత మొదటి ఆప్షన్ FSC Search మీద క్లిక్ చేయండి.
- తర్వాత స్క్రీన్ మీద కనిపించే రేషన్ కార్డు సర్చ్ మీద క్లిక్ చేయాలి.
- తర్వాత ఎఫ్ ఎస్ సి అప్లికేషన్ సెర్చ్ (FSC Application Search) మీద క్లిక్ చేయాలి.
- మీసేవ లో చేసిన రేషన్ కార్డు దరఖాస్తు అప్లికేషన్ నెంబర్, జిల్లా పేరు నమోదు చేయగానే మీ రేషన్ కార్డు స్టేటస్ ఏంటి అన్నది తెలుస్తుంది. కొత్త రేషన్ కార్డు మంజూరు అయిందా? లేదా ఎక్కడ పెండింగ్ ఉందన్న వివరాలు మీకు కనిపిస్తాయి.






















