అన్వేషించండి

TG New Ration Cards: నేడు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ, స్వయంగా పంపిణీ చేయనున్న రేవంత్ రెడ్డి

Telangana Ration Cards News | సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నారు.

హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేడు కొత్త రేషన్ కార్డుల పంపిణీని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నారు. కొత్తగా 3.58 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది.

తిరుమలగిరిలో బహిరంగ సభ

 సోమవారం (జులై 14న) సాయంత్రం తిరుమలగిరి బహిరంగసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. కొత్తగా జారీ చేస్తున్న రేషన్ కార్డులతో కలిపితే తెలంగాణలో మొత్తం కార్డులు 95,56,625కు చేరనుండగా లబ్ధిదారులు 3 కోట్లు దాటనున్నారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తెలిపారు. కానీ కొన్ని రోజుల కింద చెప్పినట్లుగా రెండు రకాల కార్డులు జారీ చేస్తారా.. లేక మొత్తం ఒకే రకమైన కార్డులు జారీ చేస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

కొత్త రేషన్ కార్డులతో సమస్యకు పరిష్కారం..

తెలంగాణ ప్రజలు గత కొన్నేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి సమస్యకు కొత్త కార్డుల ద్వారా పరిష్కారం దొరుకుతుందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలు దఫాలుగా తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది. ఈ ఏడాది జనవరి 26న నాలుగు పథకాలు ప్రారంభించిన సమయంలోనే గ్రామ సభలు నిర్వహించి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. మీ సేవా కేంద్రాల్లోనూ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఏప్రిల్ నెలలోనే రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. పలు దఫాలు ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు జులై 14న కొత్త రేషన్ కార్డుల జారీతో లక్షలాది కుటుంబాలకు ఈ సమస్య తీరుతుంది.

ప్రభుత్వంపై ఏటా రూ.1150 కోట్ల భారం 
సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 3,58,187 రేషన్‌కార్డులను జారీ చేయనుంది. వాటి ద్వారా కొత్తగా 11,11,223 మందికి లబ్ధి చేకూరుతుంది. పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులు 4,41,851 మందిని సైతం చేరుస్తున్నాం. దాంతో కొత్తగా 15,53,074 మందికి ఆహార భద్రత కింద రేషన్‌ ప్రయోజనం కలుగుతుంది. మొదటిదశగా నారాయణపేట జిల్లాలో నిర్వహించిన సభ ద్వారా 2 లక్షల 3 వేల కొత్త కార్డులు మంజూరుచేశాం. ఆ కార్డుల జారీతో కొత్తగా 5,90,488 మందికి లబ్ధి చేకూరింది. పాతకార్డుల్లో కొత్తగా 6,39,784 మందిని చేర్చడంతో మొత్తం 12,30,272 మంది కొత్తగా రేషన్‌ ప్రయోజనాలు పొందుతున్నారు. 

రెండోదశ కొత్త రేషన్ కార్డుల జారీని ఈనెల 14న చేపడుతున్నాం. కొత్త లబ్ధిదారుల 15,53,074 మందికి ప్రయోజనం కలగనుంది. కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు పాత రేషన్ కార్డుల్లో కొత్త వ్యక్తుల చేరికతో తెలంగాణ ప్రభుత్వం ఖజానాపై ఏడాదికి అదనంగా రూ.1150.68 కోట్ల భారం పడుతుంది’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తెలిపారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Nalgonda Crime News: యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు
యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్‌లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
Embed widget