News
News
X

Rains in AP Telangana: నేడు ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన, అక్కడ ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని  భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా  ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. ఉపరితల ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి దక్షిణ దిశవైపునకు వంపు తిరిగి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశ నుంచి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
హైదరాబాద్, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. నేడు సైతం నగరాన్ని మబ్బులు కమ్మేశాయి. గంటకు 6 నుంచి 12 కి.మీ వేగంతో చల్లనిగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నందున పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఏపీలో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో పిడుగులు పడే పడే అవకాశం ఉందని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురవనుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర లోని ఉమ్మడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో తేలికపాటి జల్లులు పడతాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుందని, ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.

Published at : 26 Jul 2022 07:20 AM (IST) Tags: telangana rains rains in telangana Weather Updates ap rains rains in ap AP Rains

సంబంధిత కథనాలు

పసుపు బోర్డు చిన్నదవుద్దని స్పైస్ బోర్డుకు ట్రై చేస్తున్నాం: ఎంపీ అర్వింద్‌

పసుపు బోర్డు చిన్నదవుద్దని స్పైస్ బోర్డుకు ట్రై చేస్తున్నాం: ఎంపీ అర్వింద్‌

Milk Price : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు

Milk Price  : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు

KCR : బీజేపీ వల్లే సమస్యలు - తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కేసీఆర్ పిలుపు !

KCR  : బీజేపీ వల్లే సమస్యలు -  తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కేసీఆర్ పిలుపు !

Munugodu BJP : మునుగోడులో టీఆర్ఎస్‌కు షాక్ - బీజేపీలో చేరిన చౌటుప్పల్ ఎంపీపీ !

Munugodu BJP :  మునుగోడులో టీఆర్ఎస్‌కు షాక్ - బీజేపీలో చేరిన చౌటుప్పల్ ఎంపీపీ !

RajBhavan Vs Pragati Bhavan : ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ ! కేసీఆర్ తీరుతో వివాదం మరింత ముదురుతోందా?

RajBhavan Vs Pragati Bhavan :  ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ !  కేసీఆర్ తీరుతో వివాదం మరింత ముదురుతోందా?

టాప్ స్టోరీస్

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు !  విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

Salaar: ప్రభాస్ 'సలార్'లో టాలెంటెడ్ యాక్టర్స్ - పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫర్మ్!

Salaar: ప్రభాస్ 'సలార్'లో టాలెంటెడ్ యాక్టర్స్ - పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫర్మ్!