Heavy Rain in Telangana: హైదరాబాద్‌లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తోన్న రోడ్లు.. హై అలర్ట్ ప్రకటించిన జీహెచ్ఎంసీ
Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, అమీర్‌పేట, ముషీరాబాద్, ఎల్బీ నగర్, అంబర్ పేట, రాజేంద్ర నగర్ సహా ప్రాంతాల్లో కుండపోతగా వాన కురిసింది.
Hyderabad Rains Alert: హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కరుస్తోంది. నగర శివార్లలోనూ కుండపోతగా వాన పడింది. నగరంలోని బంజారాహిల్స్, అమీర్‌పేట, ముషీరాబాద్, అంబర్‌పేట, కాచిగూడ, ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి, అఫ్జల్‌గంజ్, దిల్‌సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, శంషాబాద్, పాతబస్తీ, గోల్కొండ, రాజేంద్ర నగర్, కిస్మత్‌పురా, రామ్‌నగర్, చంపాపేట్ సహా పలు ప్రాంతాలలో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
హైటెక్ సిటీ, కూకట్ పల్లి, ఎల్బీ నగర్, బీఎన్‌రెడ్డి నగర్, అబ్దుల్లాపూర్ మెట్, అనాజ్‌పూర్‌లో సైతం కొన్ని గంటల నుంచి వర్షం కురుస్తోంది. వర్షపు నీటితో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పలు జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Also Read: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు.. పూర్తి వివరాలు
Heavy rain lashes parts of Telangana; visuals from Hyderabad
— ANI (@ANI) October 8, 2021
"Telangana is likely to witness light to moderate rainfall in few districts including Hyderabad during the next 24 hours," says K Nagaratnam, Director, IMD, Hyderabad pic.twitter.com/6PSKrfMoxR
మరో మూడు రోజులు వర్షాలే..
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు మధ్య అరేరబియా సముద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పేర్కొంది. దాంతో పాటు అక్టోబర్ 10న ఉత్తర అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Also Read: ఇప్పుడంటే వాట్సాప్, ఫేస్‌బుక్.. అప్పట్లో ఆల్ ఇన్ వన్ అయిన పోస్ట్ కార్డ్స్ గురించి ఈ విషయాలు తెలుసా!
చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
నగరంలోని పలు ప్రాంతాల్లో నేటి సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో హైదరాబాద్ మరోసారి చిగురుటాకులా వణికిపోయింది. నాలాల వద్ద జాగ్రత్తగా ఉండాలని వాహనదారులను, పాదచారులను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. అధికారులు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. జీహెచ్ఎంసీలో ఎక్కడైనా సమస్య ఉంటే తమకు తెలపాలని 040 21111111 కాల్ సెంటర్ నెంబర్ ఇచ్చారు.
Also Read: అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేయండి.. తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క