Bhatti Vikramarka: అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేయండి.. తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
Annapurna Canteens: హైదరాబాద్ లోని పెద్ద పెద్ద ఆసుపత్రులకు వచ్చే పేషెంట్ల బంధువులు, సహాయకుల కష్టాలు తీర్చాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, బసవ తారకం ఆసుపత్రి లాంటి హైదరాబాద్ లోని పెద్ద పెద్ద ఆసుపత్రులకు వచ్చే పేషెంట్ల బంధువులు, సహాయకుల కష్టాలు తీర్చాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP Leader Mallu Bhatti Vikramarka) తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. పేషెంట్లు ఆస్పత్రిలో ఉంటే.. వారి వెంట వచ్చిన కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి బయట ఉంటారు. వారు తమకు ఆహారం దొరుకుతుందా, ఎవరైనా దాతలు ఆహారం దానం చేస్తారా అని ఎదురుచూస్తుంటారని అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రస్తావించారు.
వారి బాగోగులు పట్టించుకోండి..
ఒకవేళ వారికి ఆహారం దొరికినా సరే.. తినేందుకు సరైన స్థలం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. పేషెంట్ల వెంట నగరంలోని ఆసుపత్రులకు వచ్చే వారికి ఉండటానికి స్థలం ఉండదని, ఆహారం దొరకదని, తాగేందుకు మంచినీళ్లు ఉండవని, వసతి ఉండవని సీఎస్పీ నేత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వారి గురించి ప్రభుత్వం ఆలోచన చేసి.. షెడ్లు, తినేందుకు వసతులు, మంచినీటి సదుపాయం కల్పించాలని కోరారు. అన్నపూర్ణ క్యాంటీన్ లను నగరంలోని పెద్ద ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందన్నారు.
Also Read: కాంగ్రెస్‌కు చేత కాలేదు.. మేం చేసి చూపిస్తున్నాం ! అసెంబ్లీలో కేసీఆర్ మార్క్ స్పీచ్ !
తాను విమర్శల కోసం మాట్లాడడం లేదని.. సంక్షేమం అనేది మనందరి బాధ్యత అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం, పాలకుల బాధ్యత అని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి ప్రతి ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివన్నారు. ఈ సమాజం వెనకబడి ఉండకూడదని, దోపిడీకి గురవకూడదని భట్టి విక్రమార్క అన్నారు. వనరులు అన్నీ రాష్ట్ర ప్రజలకు అందాలని, తద్వారా అందరూ బాగా ఎదగాలని భావించే మంచి జరుగుతుందన్నారు. అన్ని ప్రాంతాల శ్రేయస్సు, అభివృద్ధి కోరుకునే యూపీఏ ఛైర్ పర్సన్‌గా సోనియా గాంధీ యూపీఏ ఛైర్ పర్సన్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు.
Also Read: హుజురాబాద్ బలిపశువు హరీష్ రావే .. టీఆర్ఎస్ -బీజేపీ కలిసే రాజకీయం చేస్తున్నాయంటున్న రేవంత్
కాంగ్రెస్ సంక్షేమ ప్రభుత్వాలు..
నీటిపారుదల ప్రాజెక్టులు, పరిశ్రమలు, సంక్షేమ రంగం కోసం అనేక పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం, భూ సంస్కరణల పేరుమీద మిగులు భూమిని అర్హులైన పేదలకు పంచడం జరగగా.. ప్రస్తుతం అలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ పాలనలో వచ్చిన గరీబీ హఠావో నినాదం తరువాత పలు రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాయని మల్లు భట్టి విక్రమార్క వివరించారు.
Also Read: కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వరా? అసెంబ్లీలో చర్చ.. కేసీఆర్ స్పష్టత, ఆసక్తికర వ్యాఖ్యలు
క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి..
రాష్ట్రంలో అందరూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రెండు నాణ్యమైనవి లభిస్తేనే నిజమైన సంక్షేమం సాధించినట్లు అని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. గ్రామాల్లో ఆసుపత్రులను ప్రారంభించాలని కోరారు. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్యను అందిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. ఇంతవరకూ వీటిని రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టలేదని గుర్తుచేశారు. కొన్ని మండలాల్లో అయినా తొలి దశలో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీఎల్పీ నేత సూచించారు.