Assembly CM KCR : కాంగ్రెస్‌కు చేత కాలేదు.. మేం చేసి చూపిస్తున్నాం ! అసెంబ్లీలో కేసీఆర్ మార్క్ స్పీచ్ !
తెంలంగాణ అసెంబ్లీ చివరి రోజున కేసీఆర్ ప్రతిపక్షాలపై సెటైర్లతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ చేసిన పనులను తమ ప్రభుత్వం చేస్తున్న పనులను విశ్లేషించారు. కాంగ్రెస్‌కు చేతకానిది తాము చేసి చూపిస్తున్నామన్నారు.
ఏడేళ్లలో తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రూ. 74,165 కోట్లు ఖర్చు చేశామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున కేసీఆర్ వివిధ అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలుపై జరిగిన స్వలకాలిక చర్చకు సమాధానం ఇచ్చారు. చివరి రోజున కేసీఆర్ ఆద్యంతం విపక్షాలపై సెటైర్లతో ప్రసంగించారు.
కాంగ్రెస్‌కు మేనేజ్‌మెంట్ స్కిల్స్ లేవు !
కేసీఆర్ ప్రసంగంలో కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎస్సీ వెల్ఫేర్ కోసం రూ. 6,198 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టామని.. కానీ తాము మాత్రం ఏడేళ్లలో రూ. 23,296 కోట్లు ఖర్చు పెట్టామని స్పష్టం చేశారు. అలాగే ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం... కాంగ్రెస్ చేసిన ఖర్చు కంటే రెండింతలు ఎక్కువే ఖర్చు పెట్టామని లెక్కలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేసినా కొందరు చిల్లరగా మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. మీ జేబులో నుంచి ఇస్తున్నారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కట్టే పనులను సమన్వయం చేసి తిరిగి ప్రజలకు ఎంత ఉజ్వలంగా, వారి అవసరాల కోసం ఎట్ల వాడుతామన్నది వారి నైపుణ్యంపై ఆధారపడి ఉంటుందన్నారు.
Also Read : ‘మా’కు మోడీకి ఏంటి సంబంధం ? ‘అతి’ స్థాయికి చేరిన తారల ఎన్నికల రగడ !
దేశానికి నిధులిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి !
వ్యవసాయం రాదన్న ఏపీ నుంచి నుంచి మనం విడిపోయాయమని ఇప్పుడు ఏపీ తలసరి ఆదాయం రూ.1.70 లక్షలు ఉంటే.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.37 లక్షలుగా ఉందని గుర్తు చేశారు. కేంద్రం తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణది రెట్టింపు. కేంద్రం దగ్గరే లేదు.. ఇక తెలంగాణకు ఏం ఇస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రం హక్కు ప్రకారం కేంద్రం నుంచి రావాల్సింది వస్తుందని... తెలంగాణనే కేంద్రానికి ఇస్తుంది.. కేంద్రం తెలంగాణకు ఇచ్చేదేమీ లేదన్నారు. దేశ ఖజానాకు నిధులు సమకూర్చేది కేవలం నాలుగైదు రాష్ట్రాలే. వాటిలో తెలంగాణ ఒకటన్నారు. సొంతభూమిలో ఇల్లు కట్టుకునే పథకం త్వరలో ప్రారంభిస్తాం.నియోజకవర్గానికి 1000 లేదా 1500 మందికి నిధులిస్తామని ప్రకటించారు. త్వరలోనే ఈ పథకం విధివిధానాలు ఖరారు చేస్తామని స్పష్టంచేశారు.
రోశయ్య ఉరి వేసుకోవడానికి తాడు తెచ్చుకున్నారు..మేమే అడ్డుకున్నాం !
కాంగ్రెస్ పార్టీ పై కేసీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు . దేశాన్ని దేశాబ్దాల పాటు పరిపాలించి ఏమీ చేయలేదని తాము ్నడం లేదని.. కానీ మంచిగా చేయలేదని అంటున్నామని స్పష్టం చేశారు. మీరు నీళ్లు ఇవ్వలేదు.. మేం ఇస్తున్నామన్నారు. కరెంట్ మీరు ఇవ్వలేదు. మేం ఇస్తున్నాం. ఇది ప్రజలకు తెలుసన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం రోశయ్యపై సెటైర్లు వేశారు. ప్రపంచ మేధావి రోశయ్య విద్యుత్ మంత్రిగా ఉన్నప్పుడు.. రెండేండ్లలో విద్యుత్ వ్యవస్థను మంచిగా చేసి ఇస్తా.. లేదంటే ఇదే శాసనసభలో ఉరేసుకుంటా అన్నారు. అది కాకపోవడంతో ఓ సారి బ్రీఫ్‌కేస్‌లో తాడు తెచ్చుకున్నారని..కానీ మేమందరం వారించి వద్దన్నామని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన దాదాపు 20 వేల కోట్లు ఖర్చు పెట్టి.. నిరంతరాయ విద్యుత్ ఇస్తున్నామని.. ప్రజలు ఆనందంగా కేసీఆర్ ప్రకటించారు.
Also Read : కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వరా? అసెంబ్లీలో చర్చ.. కేసీఆర్ స్పష్టత, ఆసక్తికర వ్యాఖ్యలు
బీజేపీ ఎమ్మెల్యేపైనా సెటైర్లు వేసిన కేసీఆర్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ చురకలంటించారు. కల్యాణలక్ష్మి పథకం ప్రారంభంలో కొంతమంది లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే సంతకం పెడితేనే చెక్ మంజూరు అవుతుందని.. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి చెక్‌లు పంపిణీ చేస్తున్నాం. రాజాసింగ్ ఎమ్మెల్యే.. మీకే సర్వాధికారాలు ఉన్నాయి. అలా జరుగుతుందంటే గవర్నమెంట్ కంటే మీకే ఎక్కువ అవమానం. అట్ల జరగనివ్వొద్దని. మీరంటే భయం లేదని అర్థమైతుందని సెటైర్ వేశారు.
Also Read : అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం.. కేటీఆర్‌ను కలిసిన రఘునందన్, ఏం మాట్లాడుకున్నారంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి