అన్వేషించండి

Breaking News Telugu Live Updates: బీఎస్ఎన్ఎల్ ఆదాయానికి గండి కొడుతున్న కేటుగాళ్ళు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Key Events
Heavy Rain in Telangana Nadu Nedu in Nellore Breaking News Live Updates Breaking News Telugu Live Updates: బీఎస్ఎన్ఎల్ ఆదాయానికి గండి కొడుతున్న కేటుగాళ్ళు
ఏపీ, తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

Background

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో భేటీ అవుతానని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో వైయస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం భేటీ అయ్యారు. పార్టీ సమన్వయ కర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలని, వారికి అప్పగించిన బాధ్యతలు పూర్తిస్థాయిలో నిర్వర్తించాలని సూచించారు. ఇటీవల జరిగిన పార్టీ సమీక్షలో గడప గడపకు మంత్రులు, ప్రజా ప్రతినిధులు వెళ్లడంపై ఆరా తీసిన సీఎం జగన్ తాజాగా సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ కీలక కార్యకర్తలపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తున్నారు.

పర్యటనలు చేయాలని ఆదేశం..
గడపగడపకూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, అందరూకూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల మీద అదనంగా బాధ్యతలు ఉన్నాయి. వారి నియోజకవర్గాలే కాకుండా, వారికి అప్పగించిన బాధ్యతలను కూడా చూసుకోవాల్సి ఉంటుందన్నారు. మీ అందరిమీద నమ్మకంతో పార్టీ సమన్వయకర్తలుగా, జిల్లా అధ్యక్షులుగా బాధ్యత అప్పగించానని, పార్టీపరంగా కార్యక్రమాలను పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత వీరికి ఉందని వారి కర్తవ్యాన్ని గుర్తుచేశారు.

తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణలో మరో 5 రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం .. మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో మిగతా జిల్లాలైన కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంట గద్వాల్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ప్రజలు అత్యవసరమైతే తప్ప, ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు.

హైదరాబాద్‌లో చాలా రోజుల నుంచి  ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో జూలై 23 (శనివారం) లీటర్ పెట్రోల్ ధర (Petrol Price Today 23 July 2022) రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద పాత ధరలకే విక్రయిస్తున్నారు. 

తెలంగాణలో ఇంధన ధరలు..
నేడు వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) నిలకడగా ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, డీజిల్‌‌ లీటర్ ధర రూ.97.35 అయింది. 
వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.109.34 కాగా, డీజిల్‌‌‌ లీటర్ ధర రూ.97.54 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) పెరిగాయి. 15 పైసలు పెరగడంతో కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.110 కాగా, 14 పైసలు పెరిగి డీజిల్ ధర రూ.98.13 అయింది. 

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో ఇంధన ధరలు మారాయి. పెట్రోల్‌ (Petrol Price in Vijayawada 23 July 2022) లీటర్ ధర రూ.111.71 కాగా, 34 పైసలు పెరిగి డీజిల్ లీటర్ ధర రూ.99.46 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరలు పెరిగాయి. విశాఖలో 50 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.110.98 అయింది. డీజిల్‌ లీటర్ ధర రూ.98.74 అయింది. చిత్తూరులో 55 పైసలు పెరిగి పెట్రోల్ లీటర్ రూ.112.51 కాగా, డీజిల్ ధర సెంచరీ కొట్టింది. చిత్తూరులో డీజిల్ లీటర్ ధర రూ.100.08 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. కర్నూలులో పెట్రోల్ ధర రూ.111.76 కాగా, డీజిల్ ధర రూ. 99.48 అయింది. నెల్లూరులో పెట్రోల్ ధర రూ.111.48 కు చేరింది. డీజిల్ ధర రూ.99.23 అయింది.

20:31 PM (IST)  •  23 Jul 2022

బీఎస్ఎన్ఎల్ ఆదాయానికి గండి కొడుతున్న కేటుగాళ్ళు

నిజామాబాద్ జిల్లాలో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.  జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లోని ఓ ఇంట్లో  అసాంఘిక కార్యక్రమాలు, సైబర్ నేరాలకు పాల్పడుతున్న బాగోతాన్ని బయటపెట్టారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా, ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచడానికి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఉగ్గెర గణేషును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు సిద్ధపల్లి అజయ్ కుమార్ పరారీలో ఉన్నాడు. సీపీ నాగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుల నుంచి కంప్యూటర్, వాయిస్ ఓవర్ పరికరం, ఇంటర్నెట్ మెటీరియల్స్, పలు కంపెనీలకు సంబంధించిన సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి సుభాష్ నగర్ లోని ఓ ఇంట్లో పక్కా సమాచారంతో త్రీ టౌన్ పోలీసులు దాడి చేశారు. నిందితులపై 4వ టౌన్ లోనూ కేసు నమోదైంది.  అయితే నిందితుడు గణేష్ ను 4వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు సిద్దపల్లి అజయ్ కుమార్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీళ్లు బీఎస్ఎన్ఎల్ సంస్థకు వచ్చే ఆదాయాన్ని గండి కొడుతున్నారని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన టౌన్ సీఐ కృష్ణ, ఎస్సై సాయినాథ్, 4వ టౌన్ ఎస్సై సందీప్, ఎస్సై భాస్కరాచారితో పాటు వారి సిబ్బందికి అభినందనలు తెలిపారు సీపీ నాగరాజు. 

 

18:59 PM (IST)  •  23 Jul 2022

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి 

అన్నమయ్య జిల్లా అనంతరాజుపేటలో ఘోర ప్రమాదం జరిగింది. కారు ఆటో ఢీకొని నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల్లో ఇద్దరు పిల్లలు, మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Janga Krishnamurthy: టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
Pawan Kalyan Sankranti Celebrations: సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!

వీడియోలు

Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Janga Krishnamurthy: టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
Pawan Kalyan Sankranti Celebrations: సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
Kantara Chapter 1 : ఆస్కార్ బరిలో కాంతార 1, మహావతార్ నరసింహ - మరో కీలక అప్డేట్... ఇండియా నుంచి మూవీస్ లిస్ట్ ఇదే!
ఆస్కార్ బరిలో కాంతార 1, మహావతార్ నరసింహ - మరో కీలక అప్డేట్... ఇండియా నుంచి మూవీస్ లిస్ట్ ఇదే!
IPAC Case in High Court: ఐ ప్యాక్‌ కేసుపై కోల్‌కతా హైకోర్టులో గందరగోళం, న్యాయమూర్తి వాకౌట్‌, విచారణ వాయిదా!
ఐ ప్యాక్‌ కేసుపై కోల్‌కతా హైకోర్టులో గందరగోళం, న్యాయమూర్తి వాకౌట్‌, విచారణ వాయిదా!
The Raja Saab: అభిమానులతో ఆటలు... ప్రభాస్ 'రాజా సాబ్'కు ఇంత దారుణమైన రిలీజా?
అభిమానులతో ఆటలు... ప్రభాస్ 'రాజా సాబ్'కు ఇంత దారుణమైన రిలీజా?
Natalie Burn : రాకింగ్ స్టార్ యష్‌తో రొమాంటిక్ సీన్ - ఎవరా టాక్సిక్ బ్యూటీ?.. తెగ సెర్చ్ చేసేస్తున్నారు
రాకింగ్ స్టార్ యష్‌తో రొమాంటిక్ సీన్ - ఎవరా టాక్సిక్ బ్యూటీ?.. తెగ సెర్చ్ చేసేస్తున్నారు
Embed widget