అన్వేషించండి

Harish Rao: తెలంగాణ జాతిపిత కేసీఆర్ అయితే.. రేవంత్ రెడ్డి బూతు పిత - హరీష్ రావు సెటైర్లు

Telangana Municipal Elections 2026: కేసీఆర్ తెలంగాణ జాతిపితేనని హరీష్ రావు స్పష్టం చేశారు. రేవంత్ బూతు పిత అని విమర్శించారు.

Father of Telangana Issue:  "త్యాగాలతో తెలంగాణను సాధించిన కేసీఆర్ ఈ రాష్ట్రానికి జాతిపిత అయితే, నోరు తెరిస్తే బూతులు మాట్లాడే రేవంత్ రెడ్డి 'బూతుల పిత' అని  బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా  గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్‌లో నిర్వహించిన భారీ రోడ్ షోలో  హరీష్ రావు  ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.  ఎంతో కష్టపడి అభివృద్ధి చేసుకున్న తెలంగాణను రేవంత్ రెడ్డి తన చేతగానితనంతో సర్వనాశనం చేస్తున్నారని, రైతులకు ఎరువులు ఇచ్చే తెలివి, వడ్లు కొనే సోయి లేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రైతుబంధు పథకం అమలుపై హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు, ఇప్పటికే రెండు విడతల నిధులను ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు మూడో విడతను కూడా ఆపేందుకు ఎలక్షన్ కోడ్‌ను సాకుగా చూపుతోందని మండిపడ్డారు.  రైతుబంధు వేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, అవసరమైతే మేమే ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తాం. దమ్ముంటే ఈ నెల 11వ తేదీలోగా బకాయిలతో కలిపి మూడు విడతల రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో వేయాలి  అని డిమాండ్ చేశారు. ఒకవేళ 11లోపు నిధులు విడుదల చేయకపోతే రైతులు కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడుతారని హెచ్చరించారు.

గజ్వేల్ లో  గతంలో పందులకు నిలయంగా ఉన్న దవాఖానను 250 పడకల కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిగా మార్చింది, ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చింది కేసీఆర్ కాదా అని  ప్రశ్నించారు. రైలు సౌకర్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో ప్రతి ఇంటికీ మేనమామలా అండగా నిలిచామని గుర్తు చేశారు. 200 రూపాయల పెన్షన్‌ను 2000 చేసిన ఘనత బీఆర్ఎస్‌దేనని, ఇప్పుడు 4000 ఇస్తామని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి ఒక్కో అవ్వతాతకు 52 వేల రూపాయల బాకీ పడ్డారని ఆరోపించారు.                             

 పనిచేసే ప్రభుత్వానికి ఓటేయాలా లేక కేవలం అక్షింతలు పంచే వారికా అని హరీష్ రావు ప్రజలను ఆలోచించమన్నారు. యాదాద్రి గుడిని, గజ్వేల్‌లో దేవాలయాలను అద్భుతంగా నిర్మించిన కేసీఆర్ గారికి అండగా నిలవాలని, సద్ది తిన్న రేవు తలవాలి  అన్న చందంగా అభివృద్ధి చేసిన కారు గుర్తుకే మున్సిపల్ ఎన్నికల్లో పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. రెండేళ్లలో మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, ప్రజ్ఞాపూర్ గౌరవం నిలబడాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.                     

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget