BRS Internal Politics: కేటీఆర్‌కు నాయకత్వం ఇచ్చినా స్వాగతిస్తా - హరీష్ రావు కీలక ప్రకటన - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
Harish Rao: కేటీఆర్ కు నాయకత్వం అప్పగించినా స్వాగతిస్తానని హరీష్ రావు ప్రకటించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

Harish Rao welcome KTR: కేటీఆర్ కు నాయకత్వం అప్పగిస్తే స్వాగతిస్తానని హరీష్ రావు ప్రకటించారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ మాటే హరీష్ బాట అని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో అంతర్గత విబేధాలు లేవని హరీష్ రావు స్పష్టం చేశారు. కేటీఆర్ నాయకత్వం అప్పగిస్తే తప్పకుండా స్వాగతిస్తానని ఒక కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పడt శిరసావహిస్తానని స్పష్టం చేశారు. తాను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను.. ఎన్ని సార్లు అడిగిన ఇదే చెప్తాను.. అని స్పష్టం చేశారు. కేసీఆర్ రు మా అధ్యక్షుడు ఆయన చెప్పింది నేను తూ.చా. తప్పకుండా పాటిస్తానన్నారు.
హరీష్ రావు ఇలా ప్రత్యేకంగా ప్రకటించడానికి కారణం సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో హరీష్ రావు పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఆయన పార్టీ మారుతారని కూడా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈ విషయాన్ని ఉద్ధృతంగా ప్రచారం చేస్తోంది. తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే హరీష్ రావు మాత్రం ఇప్పుడు స్పందించారు. హరీష్ రావు ప్రకటనతో బీఆర్ఎస్ లో ఏదో జరిగిపోతోందన్న కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారానికి బ్రేక్ పడటం మరింత ఎక్కువగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విషయలో హరీష్ రావుకు ప్రాధాన్యత లభించలేదని ఆయనను పక్కన పెట్టారని చెప్పుకున్నారు. అయితే హరీష్ రావు మాత్ర ఎక్కడా పార్టీపై కానీ..కేసీఆర్ పై కానీ లేదా కేటీఆర్ తో కానీ చిన్న అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఆయన ఎప్పుడూ పార్టీకి విధేయంగానే ఉన్నారు. ఇలాంటి టాపిక్ మీద స్పందించడం అంటే.. అవి మరింతగా ప్రచారం జరగడానికి ఆజ్యం పోయడమే. ఇప్పుడు అదే జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. హరీష్ రావుతో పాటు కవిత కూడా అసంతృప్తిగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను.. ఎన్నిసార్లు అడిగిన ఇదే చెప్తాను.
— Santhosh BRS USA (@SanthoshBRSUSA) May 13, 2025
కేసీఆర్ గారు మా అధ్యక్షుడు.. నేను ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను.. ఆయన చెప్పింది నేను తూచా తప్పకుండా పాటిస్తాను.
కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ బాధ్యతలిస్తే స్వాగతిస్తాను.
- మాజీ మంత్రి హరీష్ రావు pic.twitter.com/Hqnnp0gwo0
కవిత కూడా తనకు పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని భావిస్తున్నారని అందుకే ఆమె.. తన జాగృతి సంస్థ ద్వారానే ఎక్కువగా కార్యక్రమాలు చేపడుతున్నారని అంటున్నారు. ఆమె కూడా సీఎం అవ్వాలన్న ఆశతో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. మొత్తంగా బీఆర్ఎస్ ఫ్యామిలీలో ఏదో జరుగుతోందని జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టేందుకు బీఆర్ఎస్ ముఖ్యనేతలు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. పైగా ఇంకా ఇంకా పెరుగుతున్నాయి.





















